IND vs SA : దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టుకు ముందు బ్యాడ్‌న్యూస్.. ఇక భారత బ్యాటర్లకు కష్టకాలమే..!
మంగళవారం నుంచి సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా మొదటి టెస్టు మ్యాచ్ ఆడనుంది

IND vs SA 1st Test Weather Report
IND vs SA 1st Test : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు అసలు సిసలు సమరానికి సిద్దమైంది. టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన టీమ్ఇండియా వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. అదే ఉత్సాహంతో ఇప్పుడు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిఫ్ 2023-25 సైకిల్‌లో ఫైనల్ చేరుకోవాలంటే భారత జట్టు ఈ టెస్టు సిరీస్‌లో గెలుపొందడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్ 26) నుంచి సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా మొదటి టెస్టు మ్యాచ్ ఆడనుంది.
అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. సెంచూరియన్‌లో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. సోమవారం (డిసెంబర్ 25)న ఉదయం నుంచి కూడా అక్కడ వర్షం పడుతోంది. దీంతో మైదానాన్ని, ముఖ్యంగా పిచ్‌ను కవర్లలతో కప్పి ఉంచారు. వర్షం వల్ల భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ జరిగే మంగళవారం రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ తెలియజేసింది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని తెలిపింది. దీంతో మొదటి రోజు పూర్తి ఆట వర్షం కారణంగా రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే.. రెండో రోజు కూడా వర్షం ముప్పు పొంచి ఉందట. అయితే.. మొదటి రోజులా కాకుండా రెండో రోజు ఎంతో కొంత ఆట జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తే పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది.
పేసర్లకు పండగ.. బ్యాటర్లకు కష్టం..
దీంతో పేసర్లు పండగ చేసుకుంటారు. పేస్, స్వింగ్, రివర్స్ స్వింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించడం ఖాయం. మామూలుగానే దక్షిణాఫ్రికాలోని పిచ్‌లు బౌలర్లకు అనుకూలం. ఇక వాతావరణం కూడా బౌలర్లకు అనుకూలంగా ఉండనుండడంతో సఫారి బౌలర్లను ఎదుర్కొని భారత బ్యాటర్లు పరుగులు సాధించడానికి శ్రమించాల్సిందే.
Gautam Gambhir : మిచెల్ స్టార్క్‌కు 24కోట్లు ఇప్పించారు.. నాకు ఓ రెండు కోట్లు ఇప్పించండయ్యా..
టీమ్ఇండియా టెస్టు టీమ్ ఇదే.. రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ ( వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ.