India vs South Africa T20 series: స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్ బుమ్రా స్థానంలో టీమిండియాలోకి సిరాజ్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృంద పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే.

India vs South Africa T20 series: స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్ బుమ్రా స్థానంలో టీమిండియాలోకి సిరాజ్

Updated On : September 30, 2022 / 9:46 AM IST

India vs South Africa T20 series: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృంద పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియాలో వచ్చే నెల నుంచి జరిగే టీ20 ప్రపంచకప్‌నకు బుమ్రా కూడా బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా కొంత కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. 2019లోనూ బుమ్రా వెన్నునొప్పితో బాధపడి దాదాపు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో వెన్నునొప్పి రావడంతో బుమ్రా ఈ విషయాన్ని బీసీసీఐకి చెప్పాడు.

అతడిని పరీక్షించిన ఫిజియో, మెడికల్‌ సిబ్బంది సిరీస్ కు దూరంగా ఉంచింది. స్కానింగ్‌ కోసం బుమ్రా మొన్న బెంగళూరుకు వెళ్లాడు. వాటి ఫలితాలు ఎలా వచ్చాయన్న విషయం తెలియరాలేదు. 2022లో బుమ్రా 5 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు మాత్రమే ఆడాడు. విండీస్‌ పర్యటనతో పాటు ఆసియా కప్ కు కూడా దూరంగా ఉన్నాడు. కాగా, దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. రెండో టీ20 అక్టోబరు 2న, మూడో టీ20 అక్టోబరు 4న జరగనుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”.. https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw