IND vs WI 1st T20: రసవత్తరపోరు.. అవేష్ ఖాన్‌కు అవకాశం వస్తుందా? భారత్ ప్లేయింగ్ XI?

భారత్, వెస్టిండీస్(IND vs WI) జట్ల మధ్య కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో రసవత్తరపోరు జరగబోతుంది. రెండు జట్లలోనూ టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్లు ఫుల్లుగా ఉండడంతో మ్యాచ్‌పై అంచనాలు..

IND vs WI 1st T20: రసవత్తరపోరు.. అవేష్ ఖాన్‌కు అవకాశం వస్తుందా? భారత్ ప్లేయింగ్ XI?

India

Updated On : February 16, 2022 / 1:17 PM IST

IND vs WI 1st T20: భారత్, వెస్టిండీస్(IND vs WI) జట్ల మధ్య కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో రసవత్తరపోరు జరగబోతుంది. రెండు జట్లలోనూ టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్లు ఫుల్లుగా ఉండడంతో మ్యాచ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. వన్డే సిరీస్‌లో భారత జట్టు చాలా సులువైన విజయాన్ని అందుకోగా.. టీ20ల్లో మాత్రం విండీస్ జట్టు మంచి సవాళ్లు ఎదుర్కోక తప్పదు.

భారత జట్టుకు బౌలింగ్‌లో మాత్రం టీమిండియాకు చాలా ఆప్షన్‌లు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ ప్రత్యేక మ్యాచ్ కోసం ప్లేయింగ్ XIలో ఎవరిని ఉంటారనేది ఆసక్తికరంగా ఉంది.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి అవకాశం దక్కుతుంది?
ఈ టీ20 సిరీస్‌కు కేఎల్ రాహుల్ దూరం అవ్వగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్‌కు ఇషాన్ కిషన్ లేదా రితురాజ్ గైక్వాడ్ దిగే అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా, రితురాజ్ మొత్తం ODI సిరీస్ నుంచి తప్పుకున్నాడు, కాబట్టి అతనికి ఈసారి అవకాశం లభించవచ్చు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో రిషబ్ పంత్ ఖాయం. ఐదో బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఉండవచ్చు.

టీమ్ ఇండియాకు ఆరో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఈ స్థానానికి భారత్‌లో దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్ పేర్లు ఉన్నాయి. దీపక్ హుడా తన అంతర్జాతీయ అరంగేట్రం సిరీస్‌లో రాణించాడు. వెంకటేష్ అయ్యర్ KKR కోసం ఆడుతుండగా.. అతనికి ఈ మైదానంలో T20 మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు నలుగురు బౌలర్లతో వస్తే, వెంకటేష్‌ను ఆల్‌రౌండర్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవచ్చు.

ఇది జరగకపోతే, హర్షల్ పటేల్ భారత్‌కు ఏడో ఆడవచ్చు. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ ఇద్దరూ లెగ్ స్పిన్నర్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరిలో ఒకరికి జట్టులో చోటు దక్కుతుంది. ఈ మ్యాచ్‌లో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చు. మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, భువనేశ్వర్‌లలో ఒకరికి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభించవచ్చు. అవేశ్ ఖాన్‌కు కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోకి ఎంట్రీ అయ్యే అవకాశం లభించవచ్చు.

ఈరోజు(16 ఫిబ్రవరి 2022) సాయంత్రం 7గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగబోతుంది.

టీమ్ ఇండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
రోహిత్ శర్మ (కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్/హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్/భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అవేష్ ఖాన్