Ind Vs WI: సెంచరీ బాది కోహ్లీ, హాఫ్ సెంచరీ కొట్టి రవీంద్ర జడేజా ఔట్

కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోగా, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ బాదాడు.

Ind Vs WI: సెంచరీ బాది కోహ్లీ, హాఫ్ సెంచరీ కొట్టి రవీంద్ర జడేజా ఔట్

Virat Kohli (@BCCI)

Updated On : July 21, 2023 / 9:40 PM IST

IND vs WI 2nd test: వెస్టిండీస్‌(West Indies)లోని ట్రినిడాడ్, క్వీన్స్ పార్క్ ఓవల్లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత (India) బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 288/4గా నమోదైన విషయం తెలిసిందే.

గురువారం ఆట ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ 87 పరుగుల వద్ద, రవీంద్ర జడేజా 36 పరుగుల వద్ద ఉన్నారు. శుక్రవారం కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోగా, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ బాదాడు. 99 ఓవర్ల వద్ద విరాట్ కోహ్లీ (121 పరుగులు) రనౌట్ అయ్యాడు.

జడేజా 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కోహ్లీ, జడేజా ఔట్ అయిన తర్వాత క్రీజులోకి ఇషాంత్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్ వచ్చారు. టీమిండియా స్కోరు 108 ఓవర్లకు 373/6 గా ఉంది.

భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 57, రోహిత్ శర్మ 80, శుభ్‌మన్ గిల్ 10, అజింక్యా రహానె 8 పరుగులు చేసి ఔటయ్యారు. 96 ఓవర్ల వరకు వెస్టిండీస్ బౌలర్లలో తొలి ఇన్నింగ్సులో కెమర్ రోచ్ 2, గార్బియల్, వార్రికన్, జాసన్ హోల్డర్ ఒక్కో వికెట్ చొప్పున  పడగొట్టారు.

Asia Cup 2023: జై షా వ్యవహరించిన తీరుపై పాకిస్థాన్ ఆగ్రహం