IND vs WI: భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు.. టీమిండియా తుది జట్టులో ఆ ఇద్దరూ ఉంటారా..? పరుగుల వరద ఖాయం..
IND vs WI 2nd Test : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ శుక్రవారం (అక్టోబర్ 10వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది.

IND vs WI 2nd Test
IND vs WI: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ శుక్రవారం (అక్టోబర్ 10వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడ్రోజుల్లోనే తొలి టెస్టు మ్యాచ్‌ను ముగించింది. రెండో టెస్టులోనూ విజయం సాధించడం ద్వారా టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుంది.
ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టుమ్యాచ్‌లో పలువురు టీమిండియా ప్లేయర్లకు విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా వర్క్‌లోడ్ కారణంగా జస్ర్పీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ టెస్టు ముగిసిన కొన్ని రోజులకే ఆసీస్ పర్యటన ఉంది. దీంతో బుమ్రాతోపాటు గాయం నుంచి కొలుకొని వచ్చి తొలి టెస్టులో ఆడిన హైదరాబాద్ కుర్రాడు నితీశ్ కుమార్‌కుసైతం విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. ఈ విషయంపై భారత అసిస్టెంట్ కోచ్ రైన్ టెన్ దస్కతే స్పందించారు.
Also Read: Tilak Varma : తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు.. 15మంది సభ్యులతో జట్టు ప్రకటన
వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టుకు టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు. మొదటి టెస్టు జట్టునే కంటిన్యూ అవుతుంది. జస్ర్పీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం లేదు. అతడు రెండో టెస్టులో ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అసిస్టెంట్ కోచ్ తెలిపారు. ఇక గాయం నుంచి కోలుకొని వచ్చిన తరువాత వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆడిన నితీశ్ కుమార్‌కు రెండో టెస్టులోనూ అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. నితీశ్ మంచి సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అవుతాడని భావిస్తున్నాం. గత ఆసీస్ పర్యటనలో నితీశ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను బౌలర్ మాత్రమే కాకుండా మంచి బ్యాటర్ కూడా. అందుకే రెండో టెస్టులోనూ మరోసారి అతనికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని భారత అసిస్టెంట్ కోచ్ రైన్ టెన్ దస్కతే పేర్కొన్నారు.
KL Rahul working hard ahead of the 2nd Test. 🇮🇳 pic.twitter.com/c1DTfyFlRE
— Johns. (@CricCrazyJohns) October 8, 2025
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు కోసం బ్యాటింగ్ పిచ్ సిద్ధమవుతోంది. తొలి రెండ్రోజులు స్ట్రోక్ ప్లేకు అనుకూలిస్తుందని, ఆట సాగుతున్నకొద్దీ స్లోటర్న్ మాత్రమే లభిస్తుందని క్యురేటర్లు అంచనా వేస్తున్నారు. వెస్టిండీస్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే ఐదు రోజులు మ్యాచ్ సాగే అవకాశం ఉంది. మూడో రోజు నుంచి మాత్రమే పిచ్ పై టర్న్ లభిస్తుంది. ఇదిలాఉంటే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు శుక్రవారం (అక్టోబర్ 10వ తేదీ) నుంచి మొదలవుతుంది.
Shubman Gill bowling throw-downs to Sai Sudharsan 👌
– The Captain. pic.twitter.com/0JDn3iru8H
— Johns. (@CricCrazyJohns) October 8, 2025