IND vs WI 4th T20 : నాలుగో టీ20లో టీమ్ఇండియా ఘన విజయం.. సిరీస్ సమం
సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకబడి ఉన్న భారత్ ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్ ఆడుతోంది.

IND vs WI 4th T20
టీమ్ఇండియా ఘన విజయం
ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకబడిన భారత్ సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి 9 వికెట్ల తేడాతో నాలుగో టీ20లో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. 179 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా వికెట్ మాత్రమే నష్టపోయి 17 ఓవర్లలో ఛేదించింది.
హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న భారత ఓపెనర్లు
పావెల్ బౌలింగ్‌లో(10.2వ ఓవర్‌లో) రెండు పరుగులు తీసి శుభ్‌మన్ గిల్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆతరువాత నాలుగో బంతిని యశస్వి జైశ్వాల్ బౌండరీకి తరలించి 33 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో అర్థశతకాన్ని అందుకున్నాడు. టీ20ల్లో యశస్వి జైశ్వాల్ కు ఇదే తొలి అర్థశతకం.
10 ఓవర్లకు భారత స్కోరు 100/0
భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతూ అర్థశతకాలను చేరువయ్యారు. 10 ఓవర్లకు భారత స్కోరు 100/0. యశస్వి జైస్వాల్(47), శుభ్‌మన్ గిల్ (49) క్రీజులో ఉన్నారు.
పవర్ ప్లే పూర్తి
భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. పవర్ ప్లే ముగిసే సరికి భారత స్కోరు 66/0. యశస్వి జైశ్వాల్ 19 బంతుల్లో 34, గిల్ 17 బంతుల్లో 30 పరుగులతో క్రీజులో ఉన్నారు
తొలి ఓవర్‌లో జైశ్వాల్ రెండు ఫోర్లు
వెస్టిండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(10), శుభ్‌మన్ గిల్(0)లు బరిలోకి దిగారు. మొదటి ఓవర్‌ను మెకాయ్ వేయగా మొదటి బంతిని, చివరి బంతిని జైశ్వాల్ ఫోర్లుగా మలిచాడు. 1 ఓవర్ కు భారత స్కోరు 10/0.
భారత లక్ష్యం 179
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో షిమ్రాన్ హెట్మెయర్ (61; 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా షై హోప్ (45; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. కైల్ మేయర్స్(17), బ్రాండన్ కింగ్(18) ఫర్వాలేనిపించగా కెప్టెన్ పావెల్(1), నికోలస్ పూరన్ (1), జేసన్ హోల్డర్ (3) విపలం కావడంతో విండీస్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ రెండు, అక్షర్ పటేల్, చాహల్, ముకేశ్ కుమార్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
షిమ్రాన్ హెట్మెయర్ అర్ధశతకం..
అర్ష్‌దీప్ సింగ్(17.6వ ఓవర్) బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో షిమ్రాన్ హెట్మెయర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది టీ20ల్లో అతడికి నాలుగో శతకం
జేసన్ హోల్డర్ క్లీన్ బౌల్డ్..
భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నారు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో (15.3వ ఓవర్) జేసన్ హోల్డర్(3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో విండీస్ 123 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.
షెపర్డ్ ఔట్..
విండీస్ మరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో(14.2 వ ఓవర్‌లో) షెపర్డ్ (9) సంజు శాంసన్ చేతికి చిక్కాడు. దీంతో విండీస్ 118 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
షై హోప్ ఔట్
వెస్టిండీస్ మరో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న షై హోప్(45; 29 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సర్లు)ను చాహల్ ఔట్ చేశాడు. 12.5వ బంతికి అక్షర్ పటేల్ క్యాచ్ అందుకోవడంతో హోప్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో వెస్టిండీస్ 106 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
సగం ఓవర్లు పూర్తి
వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు పూర్తి అయ్యాయి. షై హోప్ దూకుడుగా ఆడుతున్నాడు. 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. అతడితో పాటు షిమ్రాన్ హెట్మెయర్(5) క్రీజులో ఉన్నాడు. 10 ఓవర్లకు విండీస్ స్కోరు 79/4.
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్
ఏడో ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేశాడు. తన మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. మొదటి బంతికి సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి నికోలస్ పూరన్(1) ఔట్ కాగా.. ఐదో బంతికి శుభ్‌మన్ చేతికి పావెల్(1) చిక్కాడు. 7 ఓవర్లు ముగిసే సరికి విండీస్ స్కోరు 57/4. షిమ్రాన్ హెట్మెయర్(0), షై హోప్(20)లు క్రీజులో ఉన్నారు.
పవర్ ప్లే పూర్తి
వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఆరో ఓవర్ ను అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. నాలుగో బంతికి బ్రాండన్ కింగ్(18; 16 బంతుల్లో 2 సిక్సర్లు) కుల్దీప్ యాదవ్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో వెస్టిండీస్ 54 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లకు విండీస్ స్కోరు 55/2. నికోలస్ పూరన్(1), షై హోప్(19) క్రీజులో ఉన్నారు.
మేయర్స్ ఔట్..
దూకుడుగా ఆడుతున్న మేయర్స్(17; 7 బంతుల్లో)ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. రెండో ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదిన మేయర్స్ ఆ తరువాతి బంతికి వికెట్ కీపర్ శాంసన్ చేతికి చిక్కాడు. 19 పరుగుల వద్ద విండీస్ మొదటి వికెట్ కోల్పోయింది.
మొదటి ఓవర్‌లో 14 పరుగులు
అక్షర్ పటేల్ మొదటి ఓవర్‌ను వేశాడు 14 పరుగులు వచ్చాయి. మేయర్స్(13) రెండు ఓ సిక్స్, ఫోర్ బాదాడు. కింగ్ (1) క్రీజులో ఉన్నాడు.
వెస్టిండీస్ తుది జట్టు : బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకేల్ హోసిన్, ఒబెడ్ మెక్‌కాయ్.
భారత తుది జట్టు : యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.
సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకబడి ఉన్న భారత్ ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.