London : సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లండ్.. విజయం సాధించాలని ఇండియా
ఇంగ్లండ్ - భారత్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ కు ఇరు జట్ల క్రీడాకారులు రెడీ అయిపోయారు. మూడో టెస్టు విజయంతో ఫుల్ ఊపు మీదున్న ఇంగ్లండ్ సిరీస్ పై కన్నేసింది.

Team India
India – England : ఇంగ్లండ్ – భారత్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ కు ఇరు జట్ల క్రీడాకారులు రెడీ అయిపోయారు. మూడో టెస్టు విజయంతో ఫుల్ ఊపు మీదున్న ఇంగ్లండ్ సిరీస్ పై కన్నేసింది. కనీసం ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. కానీ…పేలవమైన బ్యాటింగ్ కనబరుస్తుండడంతో విజయం సాధిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బలహీనతల కారణంగా..కోహ్లీ సేన పరాజయాల పాలవుతోంది. మొదటి టెస్టు టీమిండియా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ అలా కాలేదు. రెండో టెస్టులో అద్భుత విజయం సాధించినా..మూడో టెస్టులో మాత్రం పరాజయం మూటగట్టుకుంది. దీంతో 1-1 ఇంగ్లండ్ సమం చేసింది.
Read More : Pawan Kalyan: పవన్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదు.. ఎవరు పెట్టారో తెలుసా?
భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా…ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగనుంది. బ్యాటింగ్ విషయంలో టీమిండియా కీలక నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్ ఉంది. తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. పేలవ ఫామ్ కనబరుస్తున్న వైస్ కెప్టెన్ అజింక్య రహనేకు చోటు దక్కుతుందా ? లేదా ? ఇతని స్థానంలో కొత్త ఆటగాడికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి.
Read More :PM Modi: స్పెషల్ డే సందర్భంగా.. రూ.125 కాయిన్ రిలీజ్ చేసిన మోదీ
సూర్యకుమార్ యాదవ్, హనుమ విహారి జట్టులో స్థానం సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఓపెనర్లు బ్యాటింగ్ లో రాణిస్తుండగా..మిడిల్ ఆర్డర్ ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే…ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ ఆటగాడు అశ్విన్ ను తీసుకొనే ఛాన్స్ ఉంది. ఇషాంత్ శర్మ…స్థానంలో ఆల్ రౌండర్ గా శార్దూల్ ఠాకూర్ ను తీసుకొనే అవకాశం ఉంది. అయితే..ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఫామ్ టీమిండియాను కలవరపెడుతోంది.