కివీస్‌తో ఆఖరి వన్డే: రెచ్చిపోయిన రాహుల్

  • Published By: sreehari ,Published On : February 11, 2020 / 04:43 AM IST
కివీస్‌తో ఆఖరి వన్డే: రెచ్చిపోయిన రాహుల్

Updated On : February 11, 2020 / 4:43 AM IST

మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా ఓవల్ మైదానం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆఖరి మూడో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా తొలుత బ్యాటింగ్ తో బరిలోకి దిగింది. రెండు వన్డేల్లో పరాజయం పాలైన కోహ్లీసేన చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. భారత ఓపెనర్లలో మయాంక్ అగర్వాల్ 1 పరుగుకే ఆదిలోనే చేతులేత్తేశాడు.

ఆ తర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక 9 పరుగులకే నిష్ర్కమించాడు. కోహ్లీ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతూ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ పృథ్వీ షాతో నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఒక దశలో పృథ్వీ షాకు లాథమ్ బౌలింగ్ లో బ్రేక్ పడింది. బంతిని షాట్ ఆడిన పృథ్వీ షా (42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు)తో 40 పరుగులతో రనౌట్ అయి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

మూడు వికెట్లు కోల్పోయే సరికి భారత్ స్కోరు 62 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికే క్రీజులో ఉన్న శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత వచ్చిన కెఎల్ రాహుల్‌తో కలిసి స్కోరును పరుగులు పెట్టించారు. 30 ఓవర్ వేసిన నీషమ్ అయ్యర్ కు దూకుడుకు బ్రేక్ వేశాడు. (63బంతుల్లో 9 ఫోర్లు)62 పరుగులు చేసిన హాఫ్ సెంచరీ దాటేసిన శ్రేయస్.. నీషమ్ వేసిన బంతికి షాట్ ఆడబోయి గ్రాండ్ హోమ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 30.3 ఓవర్లలో భారత్ మొత్తం నాలుగు వికెట్లు కోల్పోయింది. 

ఆ తర్వాత కేఎల్ రాహుల్ (78బంతుల్లో 7 ఫోర్లు) 63 హాఫ్ సెంచరీ నమోదు చేయగా, మనీష్ పాండే (12) పరుగులతో నాటౌట్ గా క్రీజులో కొనసాగుతున్నారు. కివీస్ బౌలర్లలో జామిసన్, బెన్నెట్, నీషమ్ తలో వికెట్ తీసుకున్నారు. వరుసగా రెండు వన్డేల్లోనూ పరాజయం పాలైన టీమిండియా.. పరువు నిలుపుకోవడం కోసమైనా ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.

మరోవైపు కివీస్ రెండు వన్డేల్లో విజయోత్సాహంతో కనిపిస్తోంది. ఈ ఆఖరి మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్ క్వీన్ స్వీప్ చేయాలని తెగ ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్ లో తడబడిన భారత్.. బౌలింగ్ లో కాస్త మెరుగ్గా రాణించి కివీస్ ను కట్టడి చేయగలదో లేదో చూడాలి. 36.3 ఓవర్లు ముగిసేసరి భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.