ENG vs IND : మరోసారి ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత్.. షెడ్యూల్ విడుదల..
వచ్చే ఏడాది టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది.

India tour of England 2026 schedule released by BCCI
భారత పురుషుల సినీయర్ జట్టు మరోసారి ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. వచ్చే ఏడాది జూలైలో భారత జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్ 5 టీ20మ్యాచ్‌లు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.
ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. జూలై 1 నుంచి 11 వరకు టీ20 సిరీస్ జరగనుండగా.. జూలై 14 నుంచి 19 వరకు వన్డే సిరీస్ జరగనుంది.
5⃣ T20Is. 3⃣ ODIs
📍 England
Fixtures for #TeamIndia‘s limited over tour of England 2026 announced 🙌#ENGvIND pic.twitter.com/Bp8gDYudXW
— BCCI (@BCCI) July 24, 2025
టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టీ20 మ్యాచ్ – 2026 జూలై 1న – డర్హమ్‌లో
రెండో టీ20 మ్యాచ్ – 2026 జూలై 4న – మాంచెస్టర్‌లో
మూడో టీ20 మ్యాచ్ – 2026 జూలై 7న -నాటింగ్హమ్‌లో
నాలుగో టీ20 మ్యాచ్ – 2026 జూలై 9న – బ్రిస్టల్‌లో
ఐదో టీ20 మ్యాచ్ – 2026 జూలై 11న – సౌతాంప్టన్‌లో
ENG vs IND : రెండో రోజు ఆటలో జడేజా మరో 12 పరుగులు చేస్తే.. అరుదైన రికార్డు..
వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి వన్డే – జూలై 14న – బర్మింగ్హమ్‌లో
రెండో వన్డే – జూలై 16న – కార్డిఫ్‌లో
మూడో వన్డే – జూలై 19న లార్డ్స్‌లో