ENG vs IND : భారత్‌కు షాక్.. పంత్‌కు 6 వారాల రెస్ట్..! సిరీస్ నుంచి ఔట్? ఇషాన్ కిషన్‌కు ఛాన్స్?
నాలుగో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే.

Rishabh Pant six weeks rest ruled out of series Reports VM
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో బంతి అతడి కుడి పాదాన్ని తాకింది. దీంతో పంత్ తీవ్ర నొప్పితో బాధపడ్డాడు. అతడి పాదం వాయడంతో పాటు రక్తం కారుతూ ఉండడం కెమెరాల్లో కనిపించింది. కనీసం నడవలేని స్థితిలో ఉన్న పంత్‌ను గోల్ఫ్‌కార్ట్‌లో మైదానంలోంచి బయటకు తీసుకువెళ్లి ఆస్పత్రికి తరలించారు.
కాగా.. పంత్‌కు అయిన గాయం తీవ్రతపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు గానీ, అతడి కుడికాలు చివరి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. కనీసం అతడు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అదే గనుక నిజమైతే.. పంత్ సిరీస్ నుంచి తప్పుకోవడం ఖాయం.
ENG vs IND : రెండో రోజు ఆటలో జడేజా మరో 12 పరుగులు చేస్తే.. అరుదైన రికార్డు..
COMEBACK STRONG, RISHABH PANT. 🤞pic.twitter.com/eTNeOV1wI2
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2025
“సిరీస్ నుంచి పంత్ తప్పుకున్నాడు. గత రాత్రి అతడు స్కానింగ్ కోసం వెళ్లాడు. అందుతున్న రిపోర్టుల ప్రకారం అతడి కుడికాలు వేలికి ఫ్రాక్చర్ అయింది. మళ్లీ బ్యాటింగ్ కు వచ్చే అవకాశం లేదు. తీవ్రమైన నొప్పితో అతడు బాధపడుతున్నాడు.” అని ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వాస్తవానికి నొప్పిని తగ్గించే మందులు వేసుకుని పంత్ బ్యాటింగ్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తుండగా, అతడు కనీసం నిలబడే స్థితిలో కూడా లేడని కథనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో మిగిలిన మ్యాచ్ లో పంత్ బదులుగా ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. లార్డ్స్‌లోనూ పంత్ గాయంతో మైదానం వీడితే ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేసిన సంగతి తెలిసిందే.
Rishabh Pant : రిషబ్ పంత్ స్థానంలో మరో ఆటగాడు బ్యాటింగ్ చేయొచ్చా.. నిబంధనలు ఏం చెబుతున్నాయ్?
🚨 PANT OUT FOR 6 WEEKS. 🚨
– Rishabh Pant advised a 6 week rest for a fractured toe. (Express Sports). pic.twitter.com/d3oavEU1C1
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 24, 2025
ఇషాన్ కిషన్‌కు చోటు..
పంత్ సిరీస్ నుంచి తప్పుకుంటే ప్రస్తుతం ధ్రువ్ జురెల్ మాత్రమే స్పెషలిస్టు వికెట్ కీపర్. దీంతో బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఇంగ్లాండ్ పంపే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన కౌంటీ మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శననే చేశాడు. అయితే.. ఐదో టెస్టులో ధ్రువ్ జురెల్ ఆడే అవకాశం ఉంది.