IND vs BAN : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్.. వర్షం లేకపోయినా మూడోరోజు ఆట రద్దు.. ఎందుకంటే?

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట కూడా రద్దయింది. వర్షం లేకపోయినా మ్యాచ్ ను

IND vs BAN : భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్.. వర్షం లేకపోయినా మూడోరోజు ఆట రద్దు.. ఎందుకంటే?

India vs Bangladesh 2nd Test

Updated On : September 29, 2024 / 3:03 PM IST

India vs Bangladesh 2nd Test Day 3: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట కూడా రద్దయింది. వర్షం లేకపోయినా మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం నుంచి మ్యాచ్ జరిగే ప్రాంతంలో వర్షం పడలేదు.. కానీ, శనివారం కురిసిన భారీ వర్షానికి మైదానం చిత్తడిగా మారింది. అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడలేదు. మ్యాచ్ నిర్వహించేందుకు పలుసార్లు అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం వరకు ఎదురుచూసినప్పటికీ మ్యాచ్ ఆడేందుకు మైదానం అనుకూలంగా లేకపోవటంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

Also Read : IPL: ఐపీఎల్‌లో ఆడే భార‌త్ క్రికెట‌ర్ల‌కు అదిరిపోయే శుభ‌వార్త చెప్పిన బీసీసీఐ

రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మొదటి టెస్టు చెన్నైలో జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా భారీ ఆధిక్యంతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, తొలిరోజు కేవలం 35 ఓవర్లు మాత్రమే ఆట సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఆ తరువాత వర్షం కారణంగా తొలిరోజు మ్యాచ్ రద్దయింది. రెండోరోజు భారీ వర్షం పడటంతో ఒక్క బంతికూడా పడకుండానే అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. మూడో రోజు వర్షం లేకపోయినా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు.

 

మధ్యాహ్నం నుంచి అయిన మ్యాచ్ ను కొనసాగించాలని అంపైర్లు ప్రయత్నించారు. తొలుత ఉదయం 10గంటలకు పిచ్, మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. మళ్లీ మధ్యాహ్నం 12గంటలకు మరోసారి పరిశీలించారు. ఆ తరువాత కాస్త ఎండ రావటంతో మధ్యాహ్నం 2 గంటల తరువాత మ్యాచ్ ప్రారంభమవుతుందని అభిమానులు ఎదురు చూశారు. 2గంటలకు మైదానాన్ని అంపైర్లు పరిశీలించారు. కానీ, అవుట్ ఫీల్డ్ లో నీటిశాతం ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లు జారిపడే ప్రమాదం ఉందని భావించిన అంపైర్లు మూడోరోజు ఆటను రద్దు చేశారు.