ఆకాశ్ దీప్‌పై శుభ్‌మన్ గిల్ ఆగ్రహం.. ‘ఏం చూస్తున్నావు..’ అంటూ.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే?
టీమిండియా బ్యాటింగ్ సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహచర ఆటగాడు ఆకాశ్ దీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

IND vs ENG 2nd Test
IND vs ENG 2nd Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్టు బుధవారం ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు రెండో రోజు (గురువారం) ఆటలో తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్ తో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. అతను 387 బంతులు ఎదుర్కొని మూడు సిక్సులు, 30 ఫోర్ల సహాయంతో 269 పరుగులు చేశాడు. తద్వారా అనేక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు.
Also Read: ఇంగ్లాండ్ బ్యాటర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆకాశ్ దీప్.. రెండు బంతుల్లో రెండు వికెట్లు.. వీడియో వైరల్
టీమిండియా బ్యాటింగ్ సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహచర ఆటగాడు ఆకాశ్ దీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండో సెషన్ ముగిసేముందు శుభ్‌మన్ గిల్ 260 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో గిల్ బంతిని మిడ్ వికెట్ వైపు తరలించాడు. ఆ సమయంలో గిల్ సింగిల్ కోసం పరిగెత్తాడు. మరోవైపు క్రీజులో ఉన్న ఆకాశ్ దీప్ కాస్త ఆలస్యంగా పరుగును ప్రారంభించాడు. ఫీల్డర్ ఓలీ పోప్ బంతిని అందుకొని నేరుగా వికెట్ కీపర్ వైపు విసిరాడు. ఆకాశ్ డ్రైవ్ చేసి బ్యాట్ క్రీజులో పెట్టాడు. కొద్దిలో రన్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో ఆకాశ్ దీప్ పై కెప్టెన్ గిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆకాశ్ దీప్ వైపు చూస్తూ ‘‘ఏం చూస్తున్నావు, త్వరగా పరిగెత్తు’ అంటూ ఆగ్రహంతో గిల్ గట్టిగా అరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
— Nihari Korma (@NihariVsKorma) July 3, 2025
బౌలింగ్ లో అదరగొట్టిన ఆకాశ్ దీప్..
బజ్‌బాల్ ఆటతో చెలరేగుదామనుకున్న ఇంగ్లాండ్‌కు ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో చెక్ పెట్టాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుస బంతుల్లో బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0)ను ఔట్ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. కొద్దిసేపటికే జాక్ క్రాలీ (19) సిరాజ్ బౌలింగ్‌లో స్లిప్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత రూట్ (18 బ్యాటింగ్), బ్రూక్ (30 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు. రెండో రోజు (గురువారం) మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.
WHAT A SPELL BY AKASH DEEP 🥶🔥 pic.twitter.com/DPTiuFUaFT
— Johns. (@CricCrazyJohns) July 3, 2025