ఇండియా- ఇంగ్లండ్ తొలి టెస్ట్‌కు అంతా రెడీ.. జింఖానా గ్రౌండ్‌లో టికెట్ విక్రయాలు

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉచితంగా మ్యాచ్ చూడొచ్చు.

ఇండియా- ఇంగ్లండ్ తొలి టెస్ట్‌కు అంతా రెడీ.. జింఖానా గ్రౌండ్‌లో టికెట్ విక్రయాలు

Updated On : January 20, 2024 / 6:05 PM IST

IND vs ENG 1st Test: టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ నెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అర్షనపల్లి జగన్మోహనరావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు జట్లు రేపు (ఆదివారం) హైదరాబాద్ చేరుకుంటాయని చెప్పారు. HCA నూతన అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మ్యాచ్ నిర్వహిస్తున్నామని, ఆధునాతన హంగులతో స్టేడియాన్ని తీర్చి దిద్దామని వెల్లడించారు. ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం
దేశ సేవ చేస్తున్న ఆర్మీ, నావి అధికారులకు టెస్ట్ మ్యాచ్ చూయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రిపబ్లిక్ డే నాడు ఆర్మీ అధికారులు, తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉచితంగా మ్యాచ్ చూసేందుకు వీలు కల్పించామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ సారి మ్యాచ్ చూపిస్తున్నామని.. ముందుగా స్కూల్ నుంచి అప్లయ్ చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. విద్యార్థులకు ఉచిత భోజన, తాగునీటి సదుపాయంతో పాటు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.

పాస్‌లు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపారు. రోజుకు 5 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అనుమతిస్తామని, దీని కోసం 300 పైగా పాఠశాలల నుంచి అప్లికేషన్లు వచ్చాయన్నారు. ఈనెల 23న పార్క్ హయత్‌లో బీసీసీఐ అవార్డ్స్ ప్రదానోత్సవం నిర్వహిస్తారని చెప్పారు. పార్క్ హయత్ హోటల్‌లో ఇండియా టీమ్, తాజ్ డెక్కన్ హోటల్‌లో ఇంగ్లాండ్ టీమ్ బసచేస్తాయని జగన్మోహన్ రావు చెప్పారు.

Also Read: షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై సానియా మీర్జా తండ్రి ఏమన్నారంటే…?

టికెట్ ధరల వివరాలు ఇవిగో..
జింఖానా గ్రౌండ్‌లో టికెట్ విక్రయాలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 26 వేల టికెట్స్ విక్రయించామని వెల్లడించారు. టికెట్ ధరలు 200 నుంచి 4 వేల రూపాయల వరకు ఉన్నాయి. రూ. 200 టికెట్ 5 రోజులకూ కావాలంటే రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. రూ.499 టికెట్ రూ.1497కు ఇస్తారు. వెయ్యి రూపాయల టికెట్‌కు 5 రోజులకు 3 వేలు చెల్లిస్తే సరిపోతుంది. రూ.1250 టికెట్ 5 రోజులకు రూ.3750 కు విక్రయిస్తున్నారు. రూ. 3 వేల రూపాయల టికెట్‌కు రూ.12 వేలు.. రూ.4 వేల టికెట్‌కు రూ.16 వేలు చెల్లిస్తే ఐదు రోజుల పాటు మ్యాచ్ చూడొచ్చు.

Also Read: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఓపెనింగ్ రేసు.. ముందంజ‌లో య‌శ‌స్వి జైస్వాల్‌.. వెనుక‌బ‌డిన శుభ్‌మ‌న్‌ గిల్