Asian Champions Trophy : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. హర్మన్ ప్రీత్ సూపర్ షో

భారత జట్టు 3-1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ ను ఓడించింది. స్టార్ ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలిచాడు. అక్షదీప్ సింగ్ ఒక ఫీల్డ్ గోల్ చేశాడు.

Asian Champions Trophy : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. హర్మన్ ప్రీత్ సూపర్ షో

Asian Champions Trophy

Updated On : December 17, 2021 / 6:32 PM IST

Asian Champions Trophy : భారత హాకీ జట్టు పాకిస్తాన్ ని చిత్తు చేసింది. బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ లో భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో భారత జట్టు 3-1 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ ను ఓడించింది. స్టార్ ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలిచాడు. అక్షదీప్ సింగ్ ఒక ఫీల్డ్ గోల్ చేశాడు. పాక్ తరఫున జునైద్ మంజూర్ ఒకే ఒక గోల్ నమోదు చేశాడు. గత మ్యాచ్ లో భారత్ ఆతిథ్య బంగ్లాదేశ్ ను 9-0తో మట్టికరిపించింది.

Vegetables : మాంసంలో లేని ప్రత్యేకతలు కూరగాయల్లో ఉన్నాయా?

హర్మన్ ప్రీత్ 8, 53వ నిమిషాల్లో గోల్స్ చేశాడు. 42వ నిమిషంలో అక్షదీప్ సింగ్ గోల్ చేశాడు. ఈ టోర్నీలో భారత్ కు ఇది వరుసగా రెండో విజయం. ఈ గెలుపుతో సెమీఫైనల్స్ కు అర్హత సాధించినట్లే. ఏడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో భారత్ టాప్ లో ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడింది. భారత హాకీ జట్టు తన తొలి మ్యాచ్ లో కొరియాతో జరిగిన పోరులో 2-2 తేడాతో డ్రాగా ముగించింది. లాస్ట్ రౌండ్ రాబిన్ మ్యాచ్ లో భారత జట్టు జపాన్ తో తలపడనుంది. ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్ ఇప్పటివరకు రెండు గేమ్స్ ఆడి ఒక పాయింట్ సాధించింది.

Cybersecurity Experts Warn : హాలీవుడ్ మూవీ ‘Spider Man’ పేరుతో సైబర నేరగాళ్ల స్కెచ్.. తస్మాత్ జాగ్రత్త!

క్రికెట్ కావొచ్చు మరొకటి కావొచ్చు.. గేమ్ ఏదైనా.. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాక్ మధ్య మ్యాచ్ అంటే.. ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. హైఓల్టేజీ క్రియేట్ అవుతుంది. భారత జట్టు పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. పాక్ పై భారత్ గెలిచిందంటే అభిమానులు సంబరాలు చేసుకుంటారు. కాగా, టీ20 వరల్డ్ కప్ లో పాక్ చేతిలో భారత్ ఓటమి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. టీమిండియా పేలవ ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే భారత హాకీ జట్టు తాజాగా నమోదు చేసిన విజయం అభిమానులను సంతోషానికి గురిచేసిందని చెప్పొచ్చు.