India vs South Africa 1st T20: తిరువనంతపురంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ల భారీ ఫ్లెక్సీలు

కేరళ రాజధాని తిరువనంతపురంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు పలువురు క్రికెటర్లకు సంబంధించిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు క్రికెట్ అభిమానులు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో ఇవాళ భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 జరగనున్న నేపథ్యంలోనే అక్కడ ఈ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

India vs South Africa 1st T20: తిరువనంతపురంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ల భారీ ఫ్లెక్సీలు

India vs South Africa 1st T20

Updated On : September 28, 2022 / 10:29 AM IST

India vs South Africa 1st T20: కేరళ రాజధాని తిరువనంతపురంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు పలువురు క్రికెటర్లకు సంబంధించిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు క్రికెట్ అభిమానులు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో ఇవాళ భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 జరగనున్న నేపథ్యంలోనే అక్కడ ఈ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

తిరువనంతపురం వ్యాప్తంగా క్రికెట్ సందడి నెలకొంది. ఇప్పటికే భారత క్రికెటర్లు తిరువనంతపురం చేరుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో 55,000 సీట్లు ఉంటాయి. భారత్-దక్షిణాఫ్రికా మధ్య మిగతా రెండు మ్యాచులు అక్టోబరు 2న గువాహటిలో, అక్టోబరు 4న ఇండోర్ లో జరగనున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచిన ఉత్సాహంతో భారత్ ఉంది.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు కూడా బలంగా ఉండడంతో సిరీస్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచ్ లు మాత్రమే జరిగాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఈ పిచ్‌ ఉంది.

Rain alert for Telangana: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం