శ్రీలంకతో రెండో టీ20 : టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్

మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మంగళవారం (జనవరి 7, 2020) ఇండోర్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఛేజింగ్ కు అద్భుతమైన మైదానం కావడంతో బౌలింగ్ ఎంచుకోవడంపైనే మెగ్గుచూపాడు. శ్రీలంకను తొలుత బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. మరోవైపు శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ కూడా ఛేజింగ్ కు మెగ్గు చూపాడు. కానీ, కోహ్లీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.
గువహటిలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో భారత జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. భారత తరపున జట్టులో యుజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. మరోవైపు శ్రీలంకలో సీనియర్ క్రికెటర్ అంగిలో మాథ్యూస్ కూడా జట్టులో చోటు దక్కలేదు.
భారత జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్.
శ్రీలంక జట్టు : లసిత్ మలింగ (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా, ఒషాడ ఫెర్నాండో, భనుష్క రాజపక్స, ధనంజయ డిసిల్వ, ఉదన, హసరంగ, లాహిరు కుమార, దనుష్క గుణ తిలక.
Captain Kohli wins the toss and elects to bowl first in the 2nd @Paytm T20I against Sri Lanka.
Live – https://t.co/OExOCS35VC #INDvSL pic.twitter.com/6eDyVQxMX6
— BCCI (@BCCI) January 7, 2020