విండీస్ కు చుక్కలు చూపించిన రాహుల్ ,కోహ్లీ….భారీ స్కోర్ నమోదుచేసిన భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : December 11, 2019 / 03:35 PM IST
విండీస్ కు చుక్కలు చూపించిన రాహుల్ ,కోహ్లీ….భారీ స్కోర్ నమోదుచేసిన భారత్

Updated On : December 11, 2019 / 3:35 PM IST

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇవాళ(డిసెంబర్-11,2019)విండీస్‌తో జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్ మెన్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ బౌలర్లకు టీమిండియా బ్యాట్స్ మెన్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా రాహుల్ 51 బంతుల్లో 91 పరుగులతో చెలరేగిపోయాడు. 34బంతుల్లో రోహిత్ శర్మ 71 పరుగులు చేయగా,29 బంతుల్లో కోహ్లీ 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240పరుగులు చేసింది భారత్. విండీస్ విజయలక్ష్యం 241పరుగులు.