IND vs ZIM 1st T20: చెలరేగిన జింబాబ్వే బౌలర్లు.. తొలి టీ20లో టీమిండియాకు ఎదురుదెబ్బ.. updates
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా జింబాబ్వే జట్టుతో భారత్ తొలి టీ20 మ్యాచులో తలపడింది.

Pic Credit: @ICC Twitter
భారత్ ఓటమి
జింబాబ్వే చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. జింబాబ్వే ఇచ్చిన 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 13 పరుగుల తేడాతో జింబాబ్వే గెలిచింది. టీమిండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయింది.
7 వికెట్లు డౌన్
శుభ్‌మన్ గిల్ కూడా ఔటయ్యాడు. 31 పరుగులు చేసి రజా బౌలింగ్ లో వెనుదిరిగాడు. అనంతరం రవి బిష్ణోయి 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రజా బౌలింగ్ లోనే ఔటయ్యాడు. టీమిండియా స్కోరు 14 ఓవర్ల నాటికి 68-7గా ఉంది.
10 ఓవర్లకు 43/5
జింబాబ్వే బౌలింగ్ దెబ్బకు భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. వెనువెంటనే వికెట్లు కోల్పోయి టీమిండియా ఒత్తిడిలో పడింది. అభిషేక్ శర్మ 0, రుతురాజ్ 7, పరాగ్ 2, రింకూ సింగ్ 0, ధ్రువ్ జురెల్ 7 పరుగులకే ఔటయ్యారు. టీమిండియా స్కోరు 10 ఓవర్ల నాటికి 43/5గా ఉంది.
భారత టార్గెట్ 116..
భారత బౌలర్ల ధాటికి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో క్లైవ్ మదండే (29 నాటౌట్) బ్రియాన్ బెన్నెట్ (23), డియోన్ మైయర్స్ (23), వెస్లీ మాధేవేరే (21), సికిందర్ రజా (17), లు రెండు అంకెల స్కోరు సాధించారు. భారత బౌలర్లలో రవిబిష్ణోయ్ నాలుగు వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్‌లు చెరో వికెట్ తీశారు.
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు వాషింగ్టన్ సుందర్..
స్పిన్నర్ వాష్టింగన్ సుందర్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. రెండో బంతికి డియోన్ మైయర్స్ (23), మూడో బంతికి మసకద్జా (0) లను ఔట్ చేశాడు. దీంతో జింబాబ్వే 14.3వ ఓవర్‌లో 89 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోయింది.
జోనాథన్ కాంప్‌బెల్ రనౌట్..
జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోతుంది. జోనాథన్ కాంప్‌బెల్ (0) రనౌట్ అయ్యాడు. దీంతో 11.6వ ఓవర్‌లో 74 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి జింబాబ్వే కష్టాల్లో పడింది.
కెప్టెన్ సికిందర్ రజా ఔట్..
ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రవిబిష్ణోయ్ క్యాచ్ అందుకోవడంతో కెప్టెన్ సికిందర్ రజా (17) ఔట్ అయ్యాడు. దీంతో 11.5వ ఓవర్‌లో 74 పరుగుల వద్ద జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది.
వెస్లీ మాధేవెరే..
జింబాబ్వే మరో వికెట్ కోల్పోయింది. రవిబిష్ణోయ్ బౌలింగ్‌లో వెస్లీ మాధేవెరే (21) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో జింబాబ్వే 7.5వ ఓవర్‌లో 51 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది
బ్రియాన్ బెన్నెట్ క్లీన్‌బౌల్డ్..
జింబాబ్వే మరో వికెట్ కోల్పోయింది. రవిబిష్ణోయ్ బౌలింగ్‌లో బ్రియాన్ బెన్నెట్ (23) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 5.1వ ఓవర్‌లో 40 పరుగుల వద్ద జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయింది.
ఇన్నోసెంట్ కైయా క్లీన్‌బౌల్డ్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఇన్నోసెంట్ కైయా(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో జింబాబ్వే 1.1వ ఓవర్‌లో 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
జింబాబ్వే తుది జట్టు..
తడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), వెస్లీ మాధేవెరే, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చతారా
భారత తుది జట్టు ..
శుభమన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్
? Toss and Team Update ?#TeamIndia elect to field in the 1st T20I
Abhishek Sharma & Riyan Parag are all set to make their international Debuts ??
Dhruv Jurel also makes his T20I Debut ??
Follow The Match ▶️ https://t.co/r08h7yfNHO#ZIMvIND pic.twitter.com/kBrVlaClKg
— BCCI (@BCCI) July 6, 2024
టాస్..
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా జింబాబ్వే జట్టుతో భారత్ తొలి టీ20 మ్యాచులో తలపడుతోంది. సీనియర్ల గైర్హజరీలో యువ భారత్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలాని భావిస్తోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేయనుంది. కాగా.. ఈ మ్యాచ్ ద్వారా అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌లు అరంగ్రేటం చేస్తున్నారు.