INDvAUS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

మహేంద్ర సింగ్ ధోనీ సొంతగడ్డ రాంచీలోని జేఎస్ సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆసీస్ తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. శుక్రవారం జరుగుతున్న మూడే వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టు కెప్టెన్ ఫించ్ టాస్ గెలిచి ఉంటే తామూ ఫీల్డింగ్ ఎంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు.
Also Read : ధోనీ.. 33 పరుగుల దూరంలో ఉన్న రికార్డు కొట్టేస్తాడా..
మరో సారి భారత్ జట్టులో ఏ మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల జోడీకి బ్రేక్ వేస్తారని భావించిన వారందరికీ కోహ్లీ షాక్ ఇచ్చాడు. అదే జట్టుతో బరిలోకి దిగాడు. వరల్డ్ కప్ ముందు జట్టును ప్రిపేర్ చేసేందుకే ఇలా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.
ఇప్పటికే సిరీస్ లో రెండు వన్డేలు గెలిచిన భారత్‌కు మూడో వన్డే గెలిస్తే దాదాపు సిరీస్ విజయం ఖాయమైపోయినట్లే.
టీమిండియా:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ‘(కెప్టెన్), అంబటి రాయుడు, విజయ్ శంకర్, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా
ఆస్ట్రేలియా:
ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్ కాంబ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టోనిస్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, జై రిచర్డ్ సన్, నాథన్ లయన్, ఆడం జంపా
Also Read : సైన్యానికి సెల్యూట్ : ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి భారత్