Bye Bye Pakistan: దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమి.. మీమ్స్‌తో పాక్‌ను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు.. ట్రెండింగ్‌లో ‘బై‌బై పాకిస్థాన్’

ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో బైబై పాకిస్థాన్ అంటూ నెట్టిట్లో నెటిజన్లు పాకిస్థాన్ ను ట్రోల్ చేస్తున్నారు.

Bye Bye Pakistan: దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమి.. మీమ్స్‌తో పాక్‌ను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు.. ట్రెండింగ్‌లో ‘బై‌బై పాకిస్థాన్’

Pakistan

Updated On : October 31, 2022 / 12:08 PM IST

Bye Bye Pakistan: దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవటంతో పాకిస్థాన్ సెమిస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు సెమీస్ కు చేరే అవకాశాలు చాలా తక్కువ. ఆదివారం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలని పాక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఒక విధంగా చెప్పాలంటే దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఇండియా విజయం సాధించాలని భారత్ అభిమానుల కంటే పాకిస్థాన్ లోని క్రికెట్ అభిమానులు ఎక్కువగా కోరుకున్నారు. మ్యాచ్ సైతం ఉత్కంఠగా చూశారు. కానీ వారిని నిరాశపరుస్తూ టీమిండియా ఓటమిపాలైంది.

టీమిండియా ఓడిపోవటంతో సోషల్ మీడియాలో మీమ్స్ తో నెటిజన్లు రెచ్చిపోయారు. ఏకంగా బైబై పాకిస్థాన్ అంటూ వీడ్కోలు పిలికే వీడియోలతో పాకిస్థాన్ జట్టును ఓ ఆటఆడుకున్నారు. ఈ విచిత్రమైన, నవ్వులు తెప్పించే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.