India’s tour of Sri Lanka: శ్రీలంక టూర్‌కు టీమిండియా సెలక్షన్ ఎప్పుడు? కెప్టెన్‌గా ఎవరు?
శ్రీలంక టూర్‌కు వెళ్లే భారత జట్టును ప్రకటించే విషయమై బీసీసీఐ సమగ్ర ఆలోచనలు చేస్తుంది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపేందుకు ప్లాన్ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారతజట్టు ఇప్పటికే WTC ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వెళ్లింది.

Indias Tour Of Sri Lanka To Be Played Between July 13 And 25
India’s tour of Sri Lanka: శ్రీలంక టూర్‌కు వెళ్లే భారత జట్టును ప్రకటించే విషయమై బీసీసీఐ సమగ్ర ఆలోచనలు చేస్తుంది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపేందుకు ప్లాన్ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారతజట్టు ఇప్పటికే WTC ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వెళ్లింది. ఈ నెల(జూన్) 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. తర్వాత నెల రోజులకు ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుంది.
ఈ మధ్యలో భారత జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుండగా.. కరోనా కారణంగా పలు దేశాల ప్రయాణాలపై ఆంక్షలు ఉండటం.. బయోబబుల్ దాటి బయటకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో టెస్టు జట్టు ఇంగ్లాండ్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలో శ్రీలంక టూర్ కోసం మరో టీమ్‍ను సిద్ధం చేస్తుంది బీసీసీఐ. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాంలో భాగంగా శ్రీలంక పర్యటనకు వేరే జట్టును బీసీసీఐ సెలెక్ట్ చేయబోతుంది.
జులైలో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ టూర్‌లో భారత్-శ్రీలంక జట్లు.. 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుండగా.. ఆ మేరకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) షెడ్యూల్ కూడా విడుదల చేసింది. భారత జట్టులోని ముఖ్య ఆటగాళ్ళు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. ఆ జట్టులోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. రెండు ఫార్మాట్లకు జట్టు ఎంపిక ఈ నెలాఖరులోగా జరుగుతుందని భావిస్తున్నారు.
ఈ క్రమంలో శ్రీలంకకు వెళ్లే జట్టుకు ఎవరు కెప్టెన్ అవుతారు? అనే దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పుడు జట్టు పర్యటన షెడ్యూల్ బయటకు వచ్చిన తరువాత, కరోనా కారణంగా.. విదేశీ పర్యటనకు ముందు జట్టును భారతదేశంలో క్వారంటైన్‌లో ఉంచనున్నారు. శ్రీలంక వెళ్లిన తర్వాత కూడా కొన్ని రోజులు హోటల్‌లో ఉండవలసి ఉంటుంది. ఈ కారణంగా టీమ్ సెలక్షన్ వెంటనే చెయ్యల్సిన పరిస్థితి ఉంది.
టీమ్ సెలెక్షన్ ఎప్పుడు? ఎవరు కెప్టెన్?
భారతీయ ఆటగాళ్ళు రెండు వారాలు భారతదేశంలో నిర్బంధంలో ఉండి, కనీసం 5 రోజులు శ్రీలంకలోని హోటల్‌లో గడపవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ నెల 15 లేదా 16వ తేదీలోగా జట్టును ఎంపిక చేయవలసి ఉంది. విరాట్, రోహిత్ లేని కారణంగా అనుభవజ్ఞుడైన ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ బాధ్యత ఇవ్వవచ్చు అని అంటున్నారు. జూలై 3 న టీం ఇండియా చెన్నై నుంచి శ్రీలంకకు బయలుదేరనున్నట్లు తెలుస్తుంది.
శ్రీలంక పర్యటన వివరాలు:
మూడు వన్డేలు జూలై 13, 16, 18 తేదీల్లో ఆడనున్నారు. టీ20 సిరీస్ జూలై 21న ప్రారంభం అవుతుంది. తదుపరి రెండు మ్యాచ్‌లు జూలై 23 మరియు 25 తేదీలలో జరుగుతాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో అన్ని మ్యాచ్‌లు ఒకే మైదానంలో జరుగుతాయి.
భారత జట్టు(అంచనా):
Shikhar Dhawan (C), Prithvi Shaw, Devdutt Padikkal, Suryakumar Yadav, Ishan Kishan (WK), Manish Pandey, Sanju Samson, Hardik Pandya, Krunal Pandya, Bhuvneshwar Kumar, Navdeep Saini, Deepak Chahar, Rahul Chahar, Kuldeep Yadav, Yuzvendra Chahal