INDvAUS: హమ్మయ్య ఒక్క వికెట్ పడింది

INDvAUS: హమ్మయ్య ఒక్క వికెట్ పడింది

Updated On : March 8, 2019 / 10:24 AM IST

రాంచీ వేదికగా జరుగుతున్న ఆసీస్-భారత్ పోరులో టీమిండియా ఎట్టకేలకు ఒక్క వికెట్ పడగొట్టింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్లను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమించింది. 
Also See: సైనా ఔట్: ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్‌లో తప్పని ఓటమి

31 ఓవర్ల వరకూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో ఉస్మాన్ ఖవాజా(92), ఆరోన్ ఫించ్ (93)పరుగులతో సాధించిన 193 పరుగుల భాగస్వామ్యాన్ని కుల్దీప్ విడగొట్టాడు. యాదవ్ వేసిన 31.5వ బంతిని ఫించ్‌కు ఎల్బీడబ్ల్యూగా తాకడంతో అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. 

34 ఓవర్లు ముగిసేసరికి ఉస్మాన్ ఖవాజా(94), గ్లెన్ మ్యాక్స్‌వెల్(9) క్రీజులో ఉన్నారు. 

Also See: INDvAUS: విజృంభించిన ఆస్ట్రేలియా, భారత్‌కు భారీ టార్గెట్