INDvsNZ: తొలి ఇన్నింగ్స్ భారత్ స్కోరు 242

INDvsNZ: తొలి ఇన్నింగ్స్ భారత్ స్కోరు 242

Updated On : February 29, 2020 / 5:12 AM IST

తొలి టెస్టు పరాజయాన్ని అధిగమించే దిశగా భారత్ బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆల్ అవుట్ అయి 242 పరుగులు చేసింది. మొదటి టెస్టుతో పోలిస్తే పరవాలేదనిపించే స్కోరు చేసింది టీమిండియా. ఓపెనర్ పృథ్వీషా(54), వన్ డౌన్‌లో వచ్చిన చెతేశ్వర్ పూజారా(54)లు సమమైన స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించారు. ఒక్క పరుగు ఎక్కువ చేసిన హనుమ విహారీ(55)దే జట్టులో హై స్కోరుగా నిలిచింది. 

అనవసర షాట్లకు యత్నించి విహారీ, పూజారా వికెట్లు చేజార్చుకున్నారు. మరోసారి కెప్టెన్ విరాట్ కోహ్లీ(3) వైఫల్యంతో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం గమనార్హం. చివర్లో వచ్చిన షమీ(16; 12బంతుల్లో 1ఫోర్, 2సిక్సులు), బుమ్రా(10)లు చక్కటి స్కోర్లు నమోదు చేశారు. మయాంక్ అగర్వాల్(7), అజింకా రహానె(7), రిషబ్ పంత్(12), రవీంద్ర జడేజా(9), ఉమేశ్ యాదవ్(0)లు ఓ మాదిరి స్కోరుతో వెనుదిరిగారు. 

న్యూజిలాండ్ బౌలర్లలో కైలె జామీసన్ 5వికెట్లు పడగొట్టగా, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ చెరో 2వికెట్లు, నీల్ వాగ్నర్ ఒక వికెట్ తీశారు. తొలి టెస్టులో పరాజయం పొందిన భారత్.. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సమం చేసుకుంటుంది. ఒకవేళ మ్యాచ్ దక్కించుకోలేకపోతే మరో సిరీస్ చేజార్చుకోక తప్పదు. 

పిచ్ పైన ఉన్న పచ్చికను బట్టి ఆడుతున్న కొద్దీ బ్యాటింగ్‌కు బాగా కలిసొచ్చే అంశం కనిపిస్తుంది. అదే సమయంలో మంచి ఫేస్‌కు, బౌన్స్‌కు అవకాశాలు ఉండటంతో కివీస్ భారీ స్కోరుకు భారత బౌలర్లు ఏ మాత్రం కళ్లెం వేస్తారో చూడాలి. 

See Also | ఆశలు ఆవిరి : ఇప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన లేనట్లే