Nitish Reddy : భార‌త్‌కు భారీ షాక్.. తొలి మూడు టీ20ల‌కు నితీశ్‌కుమార్ రెడ్డి దూరం..

ఆసీస్‌తో తొలి మూడు టీ20 మ్యాచ్‌ల‌కు నితీశ్‌కుమార్ రెడ్డి (Nitish Reddy) దూరం అయ్యాడు.

Nitish Reddy : భార‌త్‌కు భారీ షాక్.. తొలి మూడు టీ20ల‌కు నితీశ్‌కుమార్ రెడ్డి దూరం..

Injured Nitish Reddy ruled out of first 3 T20Is against australia

Updated On : October 29, 2025 / 2:44 PM IST

Nitish Reddy : భార‌త్‌, ఆసీస్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభ‌మైంది. కాన్‌బెర్రా వేదిక‌గా జ‌రుగుతున్న తొలి మ్యాచ్‌లో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. కాగా.. భార‌త తుది జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ నితీశ్‌కుమార్ రెడ్డికి చోటు ద‌క్క‌లేదు. హార్దిక్ పాండ్యా గాయం కార‌ణంగా ఈ సిరీస్‌కు ఎంపిక కానీ నేప‌థ్యంలో అత‌డి స్థానాన్ని నితీశ్ భ‌ర్తీ చేస్తాడ‌ని భావించ‌గా.. తొలి మ్యాచ్‌లో అత‌డు బ‌రిలోకి దిగ‌క‌పోవ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

దీనిపై బీసీసీఐ స్పందించింది. అడిలైడ్ వేదిక‌గా ఆసీస్‌తో జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్ స‌మ‌యంలో నితీశ్ కుమార్ రెడ్డి గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అత‌డి ఎడ‌మ తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో చాలా ఇబ్బంది ప‌డ్డాడు. ఈ క్ర‌మంలోనే మూడో వ‌న్డేకు దూరం అయ్యాడు. కోలుకుని టీ20 సిరీస్‌లో ఆడుతాడు అనుకుంటే అలా జ‌ర‌గ‌లేదు. ఆ గాయంతో పాటు మెడ నొప్పితో ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అత‌డు వైద్య బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న‌ట్లు చెప్పుకొచ్చింది. ఈ క్ర‌మంలోనే తొలి మూడు టీ20 మ్యాచ్‌లు ఆడ‌డ‌ని వెల్ల‌డించింది.

Babar Azam : ఇది క‌దా బాబ‌ర్ ఆజామ్ అంటే.. టీ20 రీఎంట్రీలో 2 బంతుల్లోనే.. సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌రచ్చ‌..

తొలి టీ20 మ్యాచ్‌లో పేస‌ర్లుగా హ‌ర్షిత్ రాణా, జ‌స్‌ప్రీత్ బుమ్రాలను తీసుకుంది. దీంతో అర్ష్‌దీప్‌సింగ్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. మీడియం పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా శివం దూబే చోటు ద‌క్కించుకున్నాడు.

Ruturaj Gaikwad : డ‌బుల్ సెంచ‌రీ చేసిన పృథ్వీ షాకు నో అవార్డు.. రుతురాజ్ గైక్వాడ్ ఏం చేశాడంటే..?

ఆసీస్‌తో తొలి టీ20కి భార‌త తుది జ‌ట్టు ఇదే..
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.