IPL 2019: RCB టైటిల్ విజేతగా నిలవనుందా?

IPL 2019: RCB టైటిల్ విజేతగా నిలవనుందా?

Updated On : April 4, 2019 / 4:18 AM IST

ఐపీఎల్ 12 సీజన్‌ ఆరంభమైన నాటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ విజయం దక్కించుకోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుందని నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. దీనికి గాను ముంబై ఇండియన్స్ 2015ఐపీఎల్ సీజన్ ఫలితాలతో పోలుస్తూ.. వరుస 4 మ్యాచ్ ల వైఫల్యం అనంతరం టైటిల్ విజేతగా నిలిచిందని పోల్చి చెబుతున్నారు. 

2015లోనూ తొలి 4 మ్యాచ్ లు ఓడిపోయన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత చెలరేగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్ నుంచి 4వ మ్యాచ్ గా ముగిసిన అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది.  2015 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోగా.. 2019 ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో బెంగళూరు కూడా సరిగ్గా 7 వికెట్ల తేడాతోనే ఓడిపోయింది. 

12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ బెంగళూరు కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ పట్టికలో ఆర్సీబీ ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. తాజా సీజన్‌లో ఆ జట్టు ఐదో మ్యాచ్‌ను బెంగళూరు వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఏప్రిల్6న శుక్రవారం ఆడనుంది.