మళ్లీ పంజాబ్‌దే మ్యాచ్.. బెంగళూరు హ్యాట్రిక్ గెలుపుకు బ్రేక్.. గేల్ గెలిపించాడు..

ఐపీఎల్ 2020సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండవ మ్యాచ్‌లో విజయం సాధించింది. 172పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. బెంగళూరుపై 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్‌ని ఛేదించే క్రమంలో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 20ఓవర్లలో 177పరుగులు పూర్తి చేసింది. కేఎల్ రాహుల్(61), క్రిస్‌గేల్(53) అర్ధ శతకాలతో.. మయాంక్ అగర్వాల్ 45పరుగులు చేసి రాణించగా.. చివరి బంతికి ఒక్క పరుగు కావల్సిన సమయంలో పూరన్ సిక్సర్‌తో విజయాన్ని అందించాడు.
బెంగళూరుతో మ్యాచ్లో ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా రాణించినట్లే కెప్టెన్ కేఎల్ రాహుల్ రాణించగా.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తన ఫస్ట్ మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడాడు. సిక్సర్లు, ఫోర్లతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ భారీ షాట్లతో పంజాబ్ స్కోరును పరుగులు పెట్టించాడు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఫస్ట్ రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడినా.. తర్వాత కుమ్మేశారు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ జట్టు వికెట్ నష్టపోకుండా 56పరుగులు చేసింది. మయాంక్ అవుట్ అయ్యాక వచ్చిన గేల్ రాణించడంతో పంజాబ్ గెలిచింది. బెంగళూరు బౌలర్లలో చాహల్ ఒక వికెట్ తీసుకోగా.. గేల్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.
అంతకుముందు మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుని బరిలోకి దిగి 171 పరుగులు చేశారు. నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. పంజాబ్ ముందు 172 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. ఆరోన్ ఫించ్, దేవదత్ పాడికల్ మొదటి వికెట్‌కు 4.1 ఓవర్లలో 38 పరుగులు జోడించారు. 12 బంతుల్లో 18 పరుగులు చేసిన తరువాత పాడికల్‌ను అర్ష్‌దీప్ అవుట్ చేశాడు.
ఫించ్ రెండో వికెట్‌కు కోహ్లీతో 24 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. కానీ అతను 62 పరుగుల స్కోరు వద్ద 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతను అవుట్ అయ్యే ముందు రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ఆ సమయంలో డివిలియర్స్ బదులు వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. సుందర్ 14 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీని తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన శివం దుబే మాత్రం 19 బంతుల్లో రెండు సిక్సర్లు సాయంతో 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రవి బిష్ణోయి వేసిన 15వ ఓవర్‌లో రెండు సిక్సర్‌లు బాది.. దూకుడుగా పరుగులు రాబడుతున్న దూబె క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దూబె అవుట్ అయ్యాక క్రీజులోకి డివిలియర్స్ వచ్చాడు. డివిలియర్స్‌ను ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. కానీ డివిలియర్స్ కేవలం 02 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీని తరువాత కోహ్లీ కూడా 38 బంతుల్లో 48 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. మహమ్మద్ షమీ వేసిన 18వ ఓవర్‌లో మూడో బంతికి డివిలియర్స్.. దీపక్ హూడా చేతికి చిక్కి అవుట్ అవగా.. ఐదో బంతికి కోహ్లీ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
బెంగళూరు స్కోర్ 137/6 దగ్గర డివిలియర్స్(2), విరాట్ కోహ్లీ(48) అవుటవగా.. ఇక పెద్దగా స్కోరు పోదు అనుకున్న సమయంలో మోరీస్, ఉడానా మెరుపులు కారణంగా.. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. మహ్మద్ షమి వేసిన చివరి ఓవర్‌లో క్రిస్ మోరిస్(25) రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టగా ఇసురు ఉడాన(10) ఒక సిక్స్ బాదాడు. అలాగే రెండు సింగిల్స్ రావడంతో చివరి ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. దీంతో పంజాబ్ టార్గెట్ 172గా అయ్యింది.
పంజాబ్ తరఫున లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన కోటాలోని నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా మొహమ్మద్ షమీ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే తన నాలుగు ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు. అదే సమయంలో, అర్ష్‌దీప్, క్రిస్ జోర్డాన్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. బెంగళూరు బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌కు మాత్రమే ఒక వికెట్ లభించింది. చాహల్ నాలుగు ఓవర్లలో 35 పరుగులకు మయాంక్ అగర్వాల్ వికెట్ తీసుకున్నాడు.