ముంబై ఇండియన్స్ నుంచి స్టార్ క్రికెటర్ ఔట్

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డులు నెలకొల్పాడు సిక్సర్ల వీరుడు. కానీ, 2018వేలం నుంచి ఏటా కొనుగోలు చేసేందుకు ప్రతి ఫ్రాంచైజీ అనాసక్తిగానే కనిపిస్తుంది. గతేడాది వేలంలో కనీస ధరకే రూ.కోటికి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ సైతం మరోసారి యువీని వేలానికి వదిలేసింది.
యువరాజ్‌తో పాటు మరో 11 మంది ఆటగాళ్లని ముంబై ఇండియన్స్ వేలంలోకి వదిలేసింది. 2016లో యువీ కోసం టోర్నీలోని అన్ని ఫ్రాంఛైజీలు పోటీపడగా.. అతడ్ని ఏకంగా రూ.16 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పట్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్) సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇన్నేళ్ల వరకూ ఒక్క ప్లేయర్ కూడా వేలంలో అంతటి ధరను చేరుకోలేకపోతున్నాడు.
కోల్‌కతా వేదికగా డిసెంబరు 19న ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరగనుండగా.. అంతకంటే ముందే అంటిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు విడుదల చేయాల్సి ఉంది.
దీంతో ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, జయంత్ యాదవ్, ఆదిత్య తారె, అంకుల్ రాయ్, డికాక్, కీరన్ పొలార్డ్, లసిత్ మలింగ, మిచెల్ మెక్లనగాన్‌లతో పాటు ఢిల్లీ నుంచి ట్రెంట్ బౌల్ట్, రూథర్‌ఫర్డ్‌లను బదిలీల రూపంలో ముంబై ఇండియన్స్ తీసుకుంది.
ముంబై ఇండియన్స్ వేలంలో విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా:
యువరాజ్ సింగ్, ఎవిన్ లావిస్, ఆడమ్ మిల్నే, బెరండ్రాఫ్, బెన్ కటింగ్, బరిందర్ శరణ్, రాసిఖ్ సలాం, పంకజ్ జైశ్వాల్, అల్జారీ జోసఫ్, హెండ్రిక్స్, మయాంక్ మార్కండే