IPL 2020: UAEలో IPL ఆడటానికి అనుమతి వచ్చేసింది

IPL 2020: UAEలో IPL ఆడటానికి అనుమతి వచ్చేసింది

Updated On : August 11, 2020 / 6:52 AM IST

కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ను యూఏఈలో ఆడేందుకు ఆమోదం తెలిపినట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సోమవారం ప్రకటించారు. సెప్టెంబర్ 19నుంచి నవంబరు 10వరకూ మూడు సిటీలు షార్జా, అబు దాబి, దుబాయ్ లలో మ్యాచ్ లు జరగనున్నాయి.



దేశంలో కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ‘అవును మాకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చేసింది’ అని పటేల్ మీడియాతో చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి పర్మిషన్ వచ్చింది. ఇండియా దేశీవాలీ లీగ్ ను విదేశాల్లో ఆడాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరి.

‘ప్రభుత్వం నుంచి ఒకసారి మాటలు అయిపోయాక ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు తెలియజేశాం. ఇప్పుడు మా దగ్గర అఫీషియల్ అప్రూవల్ కూడా ఉంది’ అని బీసీసీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. దాదాపు ఫ్రాంచైజీలు ఆగష్టు 20నుంచి కొవిడ్ టెస్టులు పూర్తయ్యాక బయల్దేరనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు, స్టాఫ్ మాత్రం ఆగష్టు 22న మహేంద్ర సింగ్ ధోనీతో పాటు చిన్న క్యాంప్ లో పాల్గొని ఆ తర్వాత బయల్దేరుతారు.



ప్రస్తుతం బీసీసీఐ.. ఐపీఎల్ కు స్పాన్సర్ దొరక్క సతమతమవుతోంది. చైనీస్ మొబైల్ కంపెనీ వీవోతో గతంలో ఉన్న రూ.440కోట్ల డీల్ ను కాదనుకోవడంతో బాబా రామదేవ్ పతాంజలి టైటిల్ స్పాన్సర్ అవడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంది.