IPL 2021 DC Vs CSK చెన్నైని ఆదుకున్న రాయుడు.. ఢిల్లీ టార్గెట్ 137

ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చ

IPL 2021 DC Vs CSK : ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

చెన్నై జట్టులో ఓపెనర్లు విఫలం అయ్యారు. ఫామ్ మీదున్న రుతురాజ్ గైక్వాడ్(13), డుప్లెసిస్(10) త్వరగానే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఊతప్ప(19), మోయిన్ అలీ(5) నిరాశపరిచారు. దీంతో చెన్నై కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన అంబటి రాయుడు చెన్నైని ఆదుకున్నాడు. రాయుడు(55) హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ ధోని(18) పర్వాలేదనిపించాడు. చెన్నై ఆ మాత్రం స్కోర్ అన్నా చేయగలిగింది అంటే అది రాయుడు చలవే. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అవేష్ ఖాన్, అన్ రిచ్ నోర్టే, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.

Android Apps : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. వెంటనే ఈ 26 యాప్స్ డిలీట్ చేయండి..

ఐపీఎల్‌ 14వ సీజన్‌ చివరి అంకానికి చేరింది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖరారు చేసుకోగా ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే టాప్‌లో నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక పోరులో తలపడుతున్నాయి. ఇప్పటికే చెరో 18 పాయింట్లతో కొనసాగుతున్న ఈ రెండు జట్లు ఈరోజు విజయం సాధించి మరింత ఆధిపత్యం చెలాయించాలని ఆశిస్తున్నాయి.

Flubot Malware : సెక్యూరిటీ అప్‌డేట్ అని మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే

గతేడాది పేలవ ఆటతీరుతో విఫలమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెలరేగిపోతోంది. వరుస విజయాలతో ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్న ధోనీసేన.. తనతో సమానంగా ఉన్న ఢిల్లీని ఈరోజు ఓడించాలని చూస్తోంది. దీంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లే ముందు మరింత ఆత్మవిశ్వాసం పొందాలని భావిస్తోంది. అయితే, గత మ్యాచ్‌లో రాజస్థాన్‌తో ఓటమిపాలవ్వడమే ఇప్పుడు ఆ జట్టును కాస్త కలవర పెడుతోంది. ఫామ్‌ పరంగా చూసినా చెన్నై ఎదురులేని రీతిలో కొనసాగుతోంది. ఓపెనర్లు రుతురాజ్‌, ఫా డుప్లెసిస్‌ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు అవసరమైన వేళ రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ, బ్రావో, ధోనీ అండగా నిలుస్తున్నారు. బౌలింగ్‌లోనూ శార్దూల్‌, దీపక్‌ చాహర్‌లకు అండగా సామ్‌కరన్‌, మొయిన్‌ అలీ ఉన్నారు. దీంతో ఎలా చూసినా చెన్నై పటిష్టంగా ఉంది.

ఢిల్లీ బలంగా కనిపిస్తున్నా..
ఇక ఢిల్లీ గతేడాదిలాగే ఈసారి కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ధోనీసేనతో సమానంగా పోటీపడుతోంది. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లోనే ఆ జట్టు బ్యాటింగ్‌ కాస్త తడబడినట్లు కనిపిస్తోంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో 127 పరుగులే చేసిన ఆ జట్టు ముంబయితో ఆడిన గత మ్యాచ్‌లోనూ 130 పరుగుల లక్ష్యాన్ని చివరి ఓవర్‌ వరకూ తీసుకెళ్లింది. ఇదివరకు మ్యాచ్‌ల్లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, పృథ్వీషా ఈరోజు మ్యాచ్‌లో బ్యాట్లు ఝుళిపిస్తే చూడాలి. ఆపై వచ్చే స్మిత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడకపోయినా పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఇక బౌలింగ్‌లో అవేశ్‌ఖాన్‌, అక్షర్‌ పటేల్‌ ప్రత్యర్థుల పనిపడుతూ జట్టు విజయాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు