ఐపీఎల్ 2021 మినీ వేలం : రూ.2.20 కోట్లకు స్మిత్‌ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Steve Smith joins Delhi Capital : ఐపీఎల్ 2021 మినీ వేలం కొనసాగుతోంది. వేలంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తక్కువ ధర పలికాడు. వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఎంట్రీ ఇచ్చిన స్మిత్ పై ఏ ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చలేదు. అయితే స్మిత్‌ను రూ.2 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ముందుగా బేస్‌ప్రైస్ నుంచి బెంగళూరు బిడ్ ప్రారంభించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 2.2 కోట్లకు బిడ్ వేసింది. అంతకంటే ఎవరూ ముందుకు రాలేదు. దాంతో స్మిత్‌ను 2.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
రూ.14.25 కోట్లకు మ్యాక్స్ వెల్ ను రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు దక్కించుకుంది. గత ఏడాది సీజన్ వేలంలో మ్యాక్స్ వెల్ కోసం 10.75 కోట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వెచ్చించింది. రూ.3.20 కోట్లకు షకీబ్ ఉల్ హసన్ ను కోల్ కతా కొనుగోలు చేసింది. తొలి రౌండ్‌లో ఆరోన్ ఫిచ్, అలెక్స్ హేల్స్, హనుమ విహారి, జేసన్ రాయ్‌లాంటి స్టార్ ఆటగాళ్లపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు.