IPL 2022 Auction : దీపక్ చహర్‌కు రూ.14కోట్లు, ప్రసిద్ధ్ కృష్ణకు రూ.10కోట్లు.. భారత యువ బౌలర్లపై కనక వర్షం
టీమిండియా తరఫున మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న యువ బౌలర్లపై ఐపీఎల్ వేలంలో కాసుల వర్షం కురిసింది. దీపక్ చహర్ ఏకంగా రూ.14 కోట్లు ధర పలకగా, ప్రసిద్ధ్ కృష్ణ రూ.10 కోట్ల ధర పలికాడు.

Deepak Chahar Prasidh Krishna
IPL 2022 Auction : టీమిండియా తరఫున మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న యువ బౌలర్లపై ఐపీఎల్ వేలంలో కాసుల వర్షం కురిసింది. దీపక్ చహర్ ఏకంగా రూ.14 కోట్లు ధర పలకగా, ప్రసిద్ధ్ కృష్ణ రూ.10 కోట్ల ధర పలికాడు. చహర్ ను అతడి పాత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ కొనుగోలు చేసింది. గతంలో అతడు జట్టుకు అందించిన సేవలకు ప్రతిఫలంగా ఘనమైన ధరను ముట్టచెప్పింది. చెన్నై జట్టు.. అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసిన ప్లేయర్ ఇతడే. బేస్ ప్రైస్ రూ.2కోట్లతో వేలంలోకి వచ్చాడు. బంతితోనే కాదు బ్యాట్ తోనూ రాణించగలడు. లోయర్ ఆర్డర్ లో వచ్చి బ్యాట్ ను ఝళిపించగలడు.
ఇక, ప్రసిద్ధ్ కృష్ణ ఇటీవలే టీమిండియాలోకి వచ్చాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో తనదైన ముద్ర వేశాడు. సఫారీలపై ఒక వన్డే ఆడి 3 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ తో సిరీస్ లోనూ రాణించాడు. ఈ సిరీస్ లో 3 వన్డేల్లో 9 వికెట్లు పడగొట్టాడు. బౌలర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. ఐపీఎల్ వేలంలో ప్రసిద్ధ్ కృష్ణను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది.
యంగ్ ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్ణ ఈసారి ఐపీఎల్ లో జాక్ పాట్ కొట్టాడు. గతేడాది కేవలం రూ.20లక్షలు ధర పలికిన కృష్ణను ఈసారి వేలంలో రాజస్తాన్ రాయల్స్ ఏకంగా రూ.10 కోట్లతో సొంతం చేసుకుంది. 2018లో కమలేష్ నాగర్ కోటికి రీప్లేస్ మెంట్ గా ఇతడు కేకేఆర్ తరఫున ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. షార్దూల్ ఠాకూర్ కూడా మిలియనీర్ జాబితాలో చేరాడు. ఢిల్లీ కేపిటల్స్ అతడిని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్-15 ఆటగాళ్ల మెగా వేలం కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రెండో సెట్ లో చురుకుగా వ్యవహరిస్తోంది. భారత సంతతి వెస్టిండీస్ ఆటగాడు, కౌంటర్ అటాకింగ్ స్పెషలిస్ట్ నికోలాస్ పూరన్ కోసం భారీగా వెచ్చించింది.
Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?
పూరన్ ను చేజిక్కించుకునేందుకు అనేక ఫ్రాంచైజీలు చివరి వరకు పోటీపడినా.. రూ.10.75 కోట్లతో సన్ రైజర్స్ కైవసం చేసుకుంది. టీ20 క్రికెట్లో పూరన్ గణాంకాలు మామూలుగా లేవు. 4వేలకు పైగా పరుగులు, 113 క్యాచ్ లు అతడి ఖాతాలో ఉన్నాయి. స్ట్రయిక్ రేటు 142.46. పూరన్ మిడిలార్డర్ లో జట్టుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడడమే కాదు, బంతిని అవలీలగా స్టాండ్స్ లోకి పంపగలడు.
ఇక, సన్ రైజర్స్ జట్టు తమిళనాడు బౌలర్ నటరాజన్ ను కూడా వేలంలో కొనుగోలు చేసింది. నటరాజన్ ను రూ.4 కోట్లకు చేజిక్కించుకుంది.
ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియలో తొలి రోజు ఆసక్తికర కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. ఇటీవల కాలంలో నమ్మదగిన ఆల్ రౌండర్ గా ఎదిగిన శార్దూల్ ఠాకూర్ కు భారీ మొత్తానికి అమ్ముడయ్యాడు. బంతితోనూ, బ్యాట్ తోనూ చెలరేగే సత్తా ఉన్న శార్దూల్ ఠాకూర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
గత కొన్ని సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన శార్దూల్… ఈసారి మరో జట్టుకు మారాడు. ఐపీఎల్ లో ఆడినా, టీమిండియాలో అయినా… కెప్టెన్ ఎప్పుడు వికెట్ కావాలన్నా బ్రేక్ ఇవ్వగలిగే సామర్థ్యం శార్దూల్ సొంతం. 2021 ఐపీఎల్ సీజన్ లో చెన్నై తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.
ఇతర ఆటగాళ్ల వివరాలు…
షారుఖ్ ఖాన్-రూ.9 కోట్లు (పంజాబ్ కింగ్స్)
రాహుల్ త్రిపాఠి- రూ.8.5 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
యజువేంద్ర చహల్- రూ.6.5 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
అభిషేక్ శర్మ-రూ.6.5 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
రాహుల్ చహర్-రూ.5.25 కోట్లు (పంజాబ్ కింగ్స్)
పరాగ్ రియాన్-రూ.3.8 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
డివాల్డ్ బ్రెవిస్- రూ.3 కోట్లు (ముంబయి ఇండియన్స్)
అభినవ్ సదరంగని-రూ.2.6 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
కుల్దీప్ యాదవ్-రూ.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
ప్రియమ్ గార్గ్-రూ.20 లక్షలు (సన్ రైజర్స్)
అశ్విన్ హెబ్బర్-రూ.20 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
సర్ఫరాజ్ ఖాన్-రూ.20 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్)