IPL 2022: ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచేంతవరకూ పెళ్లి చేసుకోనంటోన్న యువతి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్ అయిన ఓ మహిళ భారీ త్యాగానికే సిద్ధపడింది. ఏకంగా తమ ఫ్రాంచైజీ గెలిచేంతవరకూ పెళ్లి చేసుకోనంటూ ప్రకటించింది. ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్..

IPL 2022: ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచేంతవరకూ పెళ్లి చేసుకోనంటోన్న యువతి

Rcb Fan

Updated On : April 13, 2022 / 10:42 AM IST

IPL 2022: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్యాన్ అయిన ఓ మహిళ భారీ త్యాగానికే సిద్ధపడింది. ఏకంగా తమ ఫ్రాంచైజీ గెలిచేంతవరకూ పెళ్లి చేసుకోనంటూ ప్రకటించింది. ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరుగుతుండగా పోస్టర్ పట్టుకుని కనిపించిన ఆ మహిళ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గెలుపు రుచి చూడని చెన్నైకు అవకాశమిచ్చింది ఆర్సీబీ. మంగళవారం జరిగిన మ్యాచ్ లో 216పరుగుల లక్ష్య చేదనకు దిగి 193పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత చెన్నై గెలుపొందటం విశేషం. కాగా, బెంగళూరు జట్టుకిది రెండో ఓటమి.

లీగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆర్సీబీ ట్రోఫీ గెలుచుకోకపోవడంతో ఈ పోస్టర్ నవ్వు తెప్పిస్తుంది. డీవై పాటి స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీవీ స్క్రీన్లపై ఆమె పలుమార్లు కనిపించింది. ఆ పోస్టర్ ను ఐపీఎల్ ఫ్యాన్స్ తెగ వాడేసుకుంటున్నారు.

Read Also: ఐపీఎల్‌లో ప్రత్యేక ఘనత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్