IPL 2022: “పాండ్యా ఫిట్‌గా ఉంటే..” రవిశాస్త్రి కీలక కామెంట్లు

హార్దిక్ పాండ్యా ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్ గా తొలి విజయాన్ని అందుకున్నాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన పోరులో పాండ్యా జట్టు గెలుపొందింది.

IPL 2022: “పాండ్యా ఫిట్‌గా ఉంటే..” రవిశాస్త్రి కీలక కామెంట్లు

Ravi Shastri

Updated On : March 29, 2022 / 3:37 PM IST

IPL 2022: హార్దిక్ పాండ్యా ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్ గా తొలి విజయాన్ని అందుకున్నాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన పోరులో పాండ్యా జట్టు గెలుపొందింది. ఈ గేమ్ లో హార్దిక్ 33 పరుగులు నమోదు చేయగా.. బౌలింగ్ చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.

బ్యాట్ తో ప్రదర్శన ఎలా ఉన్నా.. బౌలర్ గా చాలా పేలవమైన ఆటతీరు కనబరిచాడు పాండ్యా. 4ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 37పరుగులు సమర్పించేశాడు. ఫిట్‌నెస్ సాధించి బౌలింగ్ చేయడం పాజిటివ్ అంశమే అయినా పరుగులు సమర్పించుకోవడమనేది చర్చకు తావిచ్చింది.

కొన్ని సంవత్సరాలుగా వెన్నునొప్పితో బాధపడుతున్న హార్దిక్.. రెగ్యూలర్ గా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఈ కారణంతోనే 2021 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో చోటు కూడా కోల్పోయాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేయడం పట్ల రెస్పాండ్ అయిన టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. ఇలాగే బౌలింగ్ చేస్తే ఐపీఎల్ కెప్టెన్సీ టీమిండియాలోకి తిరిగి వెళ్లడానికి ఇంజెక్షన్ లా పనిచేస్తుందంటూ కామెంట్ చేశాడు.

Read Also: గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్

 

‘ఫొటో చూస్తేనే తెలుస్తుంది. మరో 4నెలల్లో జరగబోయే వరల్డ్ కప్ కోసం ఎలా ఫిట్ అయ్యాడోనని. ఆప్టిమమ్ ఫిట్‌నెస్ తో ఆడగలడని అనుకుంటున్నా. టాస్ వేయడాని కంటే ముందే అతణ్ని చూశా. అతని ఆట నాకు తెలుసు. బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా డిఫరెంట్ గా ఆడతాడు. ఇప్పుడు తాను కెప్టెన్ కూడా. సూపర్ ఛార్జ్ అవ్వాలి మరి’ అని వివరించాడు.