IPL 2023 Auction : ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్లపై కనక వర్షం, ఎవరు ఎన్ని కోట్లు పలికారంటే..

ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్లపై కనక వర్షం కురిసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. ఆ జట్టు క్రికెటర్లను.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించి పోటీలు పడి మరీ కొన్నాయి. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్, ఆల్ రౌండర్ సామ్ కరణ్ జాక్ పాట్ కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు.

IPL 2023 Auction : ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్లపై కనక వర్షం, ఎవరు ఎన్ని కోట్లు పలికారంటే..

Updated On : December 23, 2022 / 6:13 PM IST

IPL 2023 Auction : ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్లపై కనక వర్షం కురిసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. ఆ జట్టు క్రికెటర్లను.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించి పోటీలు పడి మరీ కొన్నాయి. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్, ఆల్ రౌండర్ సామ్ కరణ్ జాక్ పాట్ కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు.

సామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ జట్టు రూ.18కోట్ల 50లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన ప్లేయర్ గా శామ్ కరణ్ రికార్డు క్రియేట్ చేశాడు.

Also Read..Sam Curran : ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్, ఎన్ని కోట్లో తెలుసా

ఇంగ్లండ్ మరో ఆల్ రౌండర్, సీనియర్ ప్లేయర్ బెన్ స్టోక్స్ కూడా అదిరిపోయే రేటు పలికాడు. బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16 కోట్ల 25లక్షలకు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ కే చెందిన హారీ బ్రూక్ ను రూ.13 కోట్ల 25లక్షలకు సన్ రైజర్స్ జట్టు కొనుక్కుంది.

Also Read..IPL Two New Franchises : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి కొత్తగా రెండు టీమ్ లు

ఆస్ట్రేలియాకు చెందిక కెమరూన్ గ్రీన్ ను ముంబై ఇండియన్స్ టీమ్.. రూ.17 కోట్ల 50లక్షలకు కొనుగోలు చేసింది. ఇక మయాంక్ అగర్వాల్ కోసం సన్ రైజర్స్ టీమ్ రూ.8 కోట్ల 25లక్షలకు కొనుగోలు చేసింది. వెస్టిండీస్ కు చెందిన జేసన్ హోల్డర్ ను రాజస్తాన్ రాయల్స్ టీమ్.. రూ.5 కోట్ల 75లక్షలకు కొనుగోలు చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కొచ్చిలో వేలం ప్ర‌క్రియ‌ జరుగుతోంది. ఈ వేలం మెగా వేలం లాంటిది కాదు. ప్రాంచైజీల వ‌ద్ద త‌క్కువ డ‌బ్బుతో పాటు, అమ్మ‌కానికి త‌క్కువ మంది ఆట‌గాళ్లు అందుబాటులో ఉంటారు. ఈ మినీ వేలానికి మొత్తం 991 మంది ఆట‌గాళ్లు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోగా, తుది జాబితాలో ఆ సంఖ్య‌ను 405కు కుదించారు. అయితే, వీరిలో 273 మంది భార‌త ఆట‌గాళ్లు కాగా, 132 మంది విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు.

ప్రాంచైజీల వ‌ద్ద డ‌బ్బు సైతం త‌క్కువ‌గానే ఉంది. హైద‌రాబాద్ జ‌ట్టు వ‌ద్ద అత్య‌ధికంగా రూ.42.25 కోట్లు డ‌బ్బు మిగిలి ఉండ‌గా, కోల్‌క‌తా జ‌ట్టు వ‌ద్ద అతి త‌క్కువ‌గా 7.05 కోట్లు మాత్ర‌మే ఉన్నాయి.

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కేరళలోని కొచ్చిలో వేలం ప్రక్రియ జరుగుతోంది. మెగా వేలంలో ఆచితూచి వ్యవహరించే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మినీ వేలంలో దూకుడు ప్రదర్శించింది. వేలం ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లండ్ యువకిశోరం హ్యారీ బ్రూక్ ను అదిరిపోయే ధరకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల సెంచరీల మోత మోగిస్తున్న హ్యారీ బ్రూక్ కోసం వేలంలో గట్టిపోటీ ఏర్పడగా, చివరికి రూ.13.25 కోట్లకు సన్ రైజర్స్ అతడిని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు, అదే ఊపులో జాతీయ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది.