IPL 2023, DC Vs SRH: ఢిల్లీపై స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం

IPL 2023, DC Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023)లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం సాధించింది.

IPL 2023, DC Vs SRH: ఢిల్లీపై స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం

IPL 2023, DC Vs SRH

Updated On : April 29, 2023 / 11:11 PM IST

IPL 2023, DC Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023)లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 29 Apr 2023 11:11 PM (IST)

    స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌()2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ 9 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

  • 29 Apr 2023 11:01 PM (IST)

    అక్ష‌ర్ ప‌టేల్ సిక్స్‌

    18 ఓవ‌ర్‌ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేశాడు. నాలుగో బంతికి అక్ష‌ర్ ప‌టేల్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు వ‌చ్చాయి. 18 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 163/6. అక్ష‌ర్ ప‌టేల్(14), రిపాల్ పటేల్(3) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 10:56 PM (IST)

    సర్ఫరాజ్ ఖాన్ క్లీన్ బౌల్డ్‌

    న‌ట‌రాజ‌న్‌ బౌలింగ్‌లో స‌ర్ఫ‌రాజ్(9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 148 ప‌రుగుల(16.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. 17 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 149/6. అక్ష‌ర్ ప‌టేల్(3), రిపాల్ పటేల్(2) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 10:47 PM (IST)

    ప్రియమ్ గార్గ్ ఔట్‌

    మ‌యాంక్ మార్కండే బౌలింగ్‌లో ప్రియ‌మ్ గార్గ్(19) క్లీన్ బౌల్డ్ అయ్యాడు, దీంతో ఢిల్లీ 140 ప‌రుగుల(15.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 16 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 141/5. అక్ష‌ర్ ప‌టేల్(1), సర్ఫరాజ్ ఖాన్(3) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 10:44 PM (IST)

    ప్రియమ్ గార్గ్

    14వ ఓవ‌ర్‌ను అభిషేక్ శ‌ర్మ వేయ‌గా తొలి బంతికి ప్రియమ్ గార్గ్ ఫోర్ కొట్టాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 138/4. ప్రియమ్ గార్గ్(11), సర్ఫరాజ్ ఖాన్(3) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 10:36 PM (IST)

    మిచెల్ మార్ష్ ఔట్‌

    అకేల్ హోసేన్ బౌలింగ్‌లో మార్‌క్ర‌మ్ క్యాచ్ అందుకోవ‌డంతో మిచెల్ మార్ష్‌(63) ఔటైయ్యాడు. దీంతో ఢిల్లీ 125 ప‌రుగుల(13.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 14 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 129/4. ప్రియమ్ గార్గ్(3), సర్ఫరాజ్ ఖాన్(2) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 10:30 PM (IST)

    మ‌నీశ్ పాండే ఔట్‌

    ఢిల్లీ మ‌రో వికెట్ కోల్పోయింది. అభిషేక్ శ‌ర్మ బౌలింగ్‌లో మ‌నీశ్ పాండే స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 115 ప‌రుగుల(12.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. 13 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 119/3. ప్రియమ్ గార్గ్(1), మిచెల్ మార్ష్(53) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 10:24 PM (IST)

    సాల్ట్ ఔట్‌

    ఢిల్లీ మ‌రో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న ఫిలిప్ సాల్ట్ ఔట్ అయ్యాడు. మ‌యాంక్ మార్కండే బౌలింగ్‌లో అత‌డే క్యాచ్ అందుకోవ‌డంతో ఫిలిఫ్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో 117 ప‌రుగుల(11.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. 12 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 114/2. మనీష్ పాండే(1), మిచెల్ మార్ష్(53) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 10:21 PM (IST)

    మిచెల్ మార్ష్‌ హాఫ్ సెంచ‌రీ

    న‌ట‌రాజ‌న్ ప‌ద‌కొండో ఓవ‌ర్ ను వేశాడు. రెండో బంతికి సింగిల్ తీసి 28 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స‌ర్లు మిచెల్ మార్ష్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 111/1. ఫిలిప్ సాల్ట్(55), మిచెల్ మార్ష్(49) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 10:16 PM (IST)

    ఫిలిప్ సాల్ట్ అర్ధ‌శ‌త‌కం

    మ‌యాంక్ మార్కండే ప‌దో ఓవ‌ర్ ను వేశాడు. రెండో బంతికి ఫోర్ కొట్టి 29 బంతుల్లో 9 ఫోర్ల‌తో ఫిలిప్ సాల్ట్ అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 105/1. ఫిలిప్ సాల్ట్(55), మిచెల్ మార్ష్(49) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 10:12 PM (IST)

    ఫోర్‌, సిక్స‌ర్‌

    అభిషేక్ శ‌ర్మ వేసిన తొమ్మిదో ఓవ‌ర్‌లో మిచెల్ మార్ష్ ఫోర్‌, సిక్స్ కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 97/1. ఫిలిప్ సాల్ట్(49), మిచెల్ మార్ష్(47) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 10:06 PM (IST)

    6 ప‌రుగులు

    ఎనిమిదో ఓవ‌ర్ వేసిన మ‌యాంక్ మార్కండే క‌ట్టుదిట్టంగా బంతులు వేయ‌డంతో ఆరు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 85/1. ఫిలిప్ సాల్ట్(48), మిచెల్ మార్ష్(36) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 10:01 PM (IST)

    22 ప‌రుగులు

    ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్ లు దూకుడుగా ఆడుతున్నారు. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఏడో ఓవ‌ర్‌లో సాల్ట్ రెండు ఫోర్లు కొట్ట‌గా మిచెల్ మార్ష్ రెండు సిక్స‌ర్లు బాదాడు. ఈ ఓవ‌ర్‌లో 22 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 79/1. ఫిలిప్ సాల్ట్(45), మిచెల్ మార్ష్(33) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 09:57 PM (IST)

    సాల్ట్ రెండు ఫోర్లు

    ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను అకేల్ హోసేన్ వేశాడు. మొద‌టి రెండు బంతుల‌ను సాల్ట్ ఫోర్లుగా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 57/1. ఫిలిప్ సాల్ట్(36), మిచెల్ మార్ష్(20) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 09:51 PM (IST)

    మిచెల్ మార్ష్ సిక్స్‌

    ఐదో ఓవ‌ర్‌ను న‌ట‌రాజ‌న్ వేయ‌గా నాలుగో బంతికి మార్ష్ సిక్స్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 46/1. ఫిలిప్ సాల్ట్(26), మిచెల్ మార్ష్(19) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 09:45 PM (IST)

    క్ర‌మంగా దూకుడు పెంచుతున్న సాల్ట్‌, మార్ష్

    క్ర‌మంగా సాల్ట్‌, మార్ష్ లు ప‌రుగుల వేగం పెంచుతున్నారు. అకేల్ హోసేన్ వేసిన నాలుగో ఓవ‌ర్‌లోని రెండో బంతికి మార్ష్ సిక్స్ బాదగా ఐదో బంతికి సాల్ట్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 35/1. ఫిలిప్ సాల్ట్(24), మిచెల్ మార్ష్(10) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 09:42 PM (IST)

    8 ప‌రుగులు

    మూడో ఓవ‌ర్‌ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేయ‌గా ఆఖ‌రి బంతికి ఫిలిప్ సాల్ట్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 23/1. ఫిలిప్ సాల్ట్(19), మిచెల్ మార్ష్(4) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 09:38 PM (IST)

    ఫిలిప్ సాల్ట్ ఫోర్‌

    రెండో ఓవ‌ర్‌ను అకేల్ హోసేన్ వేశాడు. రెండో బంతికి ఫిలిప్ సాల్ట్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 15/1. ఫిలిప్ సాల్ట్(12), మిచెల్ మార్ష్(3) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 09:31 PM (IST)

    రెండో బంతికే వార్న‌ర్ డ‌కౌట్‌

    ఢిల్లీ జ‌ట్టు లక్ష్య ఛేద‌న‌కు దిగింది. డేవిడ్ వార్న‌ర్‌, ఫిలిప్ సాల్ట్ ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. తొలి ఓవ‌ర్‌ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేశాడు. రెండో బంతికే డేవిడ్ వార్న‌ర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి.

  • 29 Apr 2023 09:15 PM (IST)

    ఢిల్లీ ల‌క్ష్యం 198

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 197 ప‌రుగులు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌(67; 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌), హెన్రిచ్ క్లాసెన్‌(53 నాటౌట్‌ ; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీయ‌గా, అక్ష‌ర్ ప‌టేల్‌, ఇషాంత్ శ‌ర్మ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 29 Apr 2023 09:10 PM (IST)

    అకేల్ హోసేన్ సిక్స్‌, ఫోర్

    మిచెల్ మార్ష్ వేసిన 19వ ఓవ‌ర్ మొద‌టి బంతికి ఫోర్‌, ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టాడు అకేల్ హోసేన్. ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 19 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 185/6. హెన్రిచ్ క్లాసెన్(44), అకేల్ హోసేన్(13) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 09:03 PM (IST)

    10 ప‌రుగులు

    అన్రిచ్ నోర్జే వేసిన 18వ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. తొలి బంతికి క్లాసెన్ సిక్స్ కొట్టాడు. 18 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 172/6. హెన్రిచ్ క్లాసెన్(43), అకేల్ హోసేన్(2) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:57 PM (IST)

    అబ్దుల్ సమద్ ఔట్

    స‌న్‌రైజ‌ర్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్ క్యాచ్ అందుకోవ‌డంతో అబ్దుల్ స‌మ‌ద్‌(28) ఔట్ అయ్యాడు. 17 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 162/6. హెన్రిచ్ క్లాసెన్(33), అకేల్ హోసేన్(0) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:53 PM (IST)

    రెండు సిక్స్‌లు కొట్టిన క్లాసెన్‌

    అక్ష‌ర్ ప‌టేల్ వేసిన 16వ ఓవ‌ర్‌లో క్లాసెన్ రెండు సిక్స్‌లు కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 17 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 152/5. హెన్రిచ్ క్లాసెన్(33), అబ్దుల్ సమద్(20) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:49 PM (IST)

    అబ్దుల్ సమద్ ఫోర్‌

    అన్రిచ్ నోర్జే వేసిన 15వ ఓవ‌ర్ తొలి బంతికి అబ్దుల్ సమద్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 9 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 135/5. హెన్రిచ్ క్లాసెన్(20), అబ్దుల్ సమద్(19) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:45 PM (IST)

    6 ప‌రుగులు

    14వ ఓవ‌ర్‌ను అక్ష‌ర్ ప‌టేల్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో 6 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 126/5. హెన్రిచ్ క్లాసెన్(19), అబ్దుల్ సమద్(11) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:41 PM (IST)

    అబ్దుల్ సమద్ సిక్స్‌

    13వ ఓవ‌ర్‌ను కుల్దీప్ యాద‌వ్ వేయ‌గా ఆఖ‌రి బంతికి అబ్దుల్ స‌మ‌ద్ సిక్స్ కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 120/5. హెన్రిచ్ క్లాసెన్(16), అబ్దుల్ సమద్(8) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:39 PM (IST)

    అభిషేక్ శ‌ర్మ ఔట్‌

    అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో వార్న‌ర్ క్యాచ్ ప‌ట్టుకోవ‌డంతో అభిషేక్ శ‌ర్మ(67) ఔట్ అయ్యాడు. 12 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 109/5. హెన్రిచ్ క్లాసెన్(13), అబ్దుల్ సమద్(0) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:32 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో 24 ప‌రుగులు

    11వ ఓవ‌ర్‌ను ముకేశ్ కుమార్ వేశాడు. అభిషేక్ శ‌ర్మ తొలి రెండు బంతుల‌ను ఫోర్లుగా మ‌లచ‌గా ఆఖ‌రి రెండు బంతుల‌కు క్లాసెన్ వ‌రుస‌గా ఫోర్‌, సిక్స్ బాదాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తంగా 24 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 107/4. అభిషేక్ శ‌ర్మ‌(66), హెన్రిచ్ క్లాసెన్(12) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:24 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు.. మార్‌క్ర‌మ్‌, బ్రూక్ ఔట్‌

    ఒకే ఓవ‌ర్‌లో స‌న్‌రైజ‌ర్స్ రెండు వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో రెండో బంతికి అక్ష‌ర్ ప‌టేల్‌కు క్యాచ్ ఇచ్చి మార్‌క్ర‌మ్‌(8) ఔట్ కాగా నాలుగో బంతికి హ్యారీ బ్రూక్(0) సైతం అక్ష‌ర్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 10 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 83/4. అభిషేక్ శ‌ర్మ‌(57), క్లాసెన్‌(0) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:18 PM (IST)

    అభిషేక్ శ‌ర్మ ఫోర్‌

    కుల్‌దీప్ యాద‌వ్ వేసిన తొమ్మిదో ఓవ‌ర్‌లోని ఐదో బంతికి అభిషేక్ శ‌ర్మ ఫోర్ కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 83/2. అభిషేక్ శ‌ర్మ‌(57), మార్‌క్ర‌మ్(8) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:15 PM (IST)

    5 ప‌రుగులు

    ఎనిమిదో ఓవ‌ర్‌ను అక్ష‌ర్ ప‌టేల్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో ఈ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 76/2. అభిషేక్ శ‌ర్మ‌(52), మార్‌క్ర‌మ్(6) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:10 PM (IST)

    సిక్స్‌తో అభిషేక్ శ‌ర్మ అర్ధ‌శ‌త‌కం

    కుల్‌దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో సిక్స్‌తో అభిషేక్ శ‌ర్మ 25 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. ఇందులో 9 ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి. 7 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 71/2. అభిషేక్ శ‌ర్మ‌(50), మార్‌క్ర‌మ్(3) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:05 PM (IST)

    అభిషేక్ శ‌ర్మ నాలుగు ఫోర్లు

    స‌న్ రైజ‌ర్స్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఇషాంత్ శ‌ర్మ ఆరో ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లో అభిషేక్ శ‌ర్మ నాలుగు ఫోర్లు కొట్ట‌డంతో మొత్తంగా 16 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 62/2. అభిషేక్ శ‌ర్మ‌(43), మార్‌క్ర‌మ్(1) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 08:00 PM (IST)

    రాహుల్ త్రిపాఠి ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో మ‌నీష్ పాండే కు క్యాచ్ ఇచ్చి రాహుల్ త్రిపాఠి(10) ఔట్ అయ్యాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ 44 ప‌రుగుల(4.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 46/2. అభిషేక్ శ‌ర్మ‌(27), మార్‌క్ర‌మ్(1) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 07:56 PM (IST)

    సిక్స్‌, ఫోర్‌

    ముకేశ్ కుమార్ నాలుగో ఓవ‌ర్‌ను వేశాడు. రెండో బంతికి అభిషేక్ శ‌ర్మ ఫోర్ కొట్ట‌గా, ఆఖ‌రి బంతికి త్రిపాఠి సిక్స్ బాదాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 42/1. అభిషేక్ శ‌ర్మ‌(25), రాహుల్ త్రిపాఠి (10) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 07:51 PM (IST)

    స‌న్‌రైజ‌ర్స్‌కు షాక్‌.. మ‌యాంక్ అగ‌ర్వాల్ ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్‌కు షాక్ త‌గిలింది. పేల‌వ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ మ‌యాంక్ అగ‌ర్వాల్(5) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఇషాంత్ శ‌ర్మ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్ క్యాచ్ అందుకోవ‌డంతో మ‌యాంక్ ఔటైయ్యాడు. 3 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 28/1. అభిషేక్ శ‌ర్మ‌(20), రాహుల్ త్రిపాఠి (1) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 07:44 PM (IST)

    మ‌యాంక్ అగ‌ర్వాల్‌ రెండు ఫోర్లు

    టాస్ గెలిచిన‌ స‌న్‌రైజ‌ర్స్ బ్యాటింగ్‌కు దిగింది. మ‌యాంక్ అగ‌ర్వాల్‌, అభిషేక్ శ‌ర్మ‌లు ఓపెన‌ర్లుగా అడుగుపెట్టారు. మొద‌టి ఓవ‌ర్‌ను ఇషాంత్ శ‌ర్మ వేయ‌గా 8 ప‌రుగులు వ‌చ్చాయి. రెండో ఓవ‌ర్‌ను నోర్జే వేయ‌గా మ‌యాంక్ అగ‌ర్వాల్ రెండు ఫోర్లు కొట్టాడు. 2 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 21/0.

  • 29 Apr 2023 07:09 PM (IST)

    ఢిల్లీ తుది జట్టు

    ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీశ్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్

  • 29 Apr 2023 07:08 PM (IST)

    సన్‌రైజర్స్ తుది జట్టు

    సన్‌రైజర్స్ హైదరాబాద్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్

  • 29 Apr 2023 07:03 PM (IST)

    సన్‌రైజర్స్ బ్యాటింగ్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి, ప్రత్యర్థి జట్టు ముందు చెప్పుకోదగ్గ లక్ష్యాన్ని ఉంచాలని భావిస్తున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్క్రామ్ అన్నాడు.