IPL 2023 : హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి

IPL 2023: ఈ సీజన్ లో హైదరాబాద్ తీరు మారలేదు. వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ పై లక్నో జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2023 : హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి

Lucknow Super Giants vs Sunrisers Hyderabad

Updated On : April 7, 2023 / 11:23 PM IST

IPL 2023 : ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్ లో హైదరాబాద్ తీరు మారలేదు. వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ పై లక్నో జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 122 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు.. 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. మరో 24 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేజ్ చేసింది.

Also Read..IPL Bowling records: ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు వీరే..

లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(31 బంతుల్లో 35 పరుగులు), కృనాల్ పాండ్యా (23 బంతుల్లో 34 పరుగులు) రాణించారు. బౌలింగ్ లో చెలరేగిన కృనాల్ పాండ్యా బ్యాటింగ్ లోనూ మెరిశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులే చేసింది. హైదరాబాద్ జట్లులో త్రిపాఠి(34), అమోల్ ప్రీత్ సింగ్(31), అబ్దుల్ సమద్(21), వాషింగ్టన్ సుందర్ (16) పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. అమిత్ మిశ్రా 2 వికెట్లు పడగొట్టాడు. యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

Also Read..MS Dhoni Warning : అలా అయితే కెప్టెన్సీ వదిలేస్తా.. సీఎస్‌కే బౌలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్

ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో హైదరబాద్ పరాజయం పాలైంది. ఇక, లక్నో జట్టుకి ఈ సీజన్ లో ఇది రెండో విజయం. తొలి మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ పై గెలుపొందిన లక్నో రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది. ఈ సీజన్ లో మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానం నిలిచింది లక్నో.

స్కోర్లు..
సన్ రైజర్స్ హైదరాబాద్ – 20 ఓవర్లలో 121/8
లక్నో సూపర్ జెయింట్స్ – 16 ఓవర్లలో 127/5