IPL 2023, MI Vs RCB: సూర్య సూపర్ బ్యాటింగ్.. బెంగళూరుని చిత్తు చేసిన ముంబై

ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు.

IPL 2023, MI Vs RCB: సూర్య సూపర్ బ్యాటింగ్.. బెంగళూరుని చిత్తు చేసిన ముంబై

Ipl 2023 MI Vs RCB

Updated On : May 9, 2023 / 11:28 PM IST

IPL 2023, MI Vs RCB: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి చేధించింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. సూర్య స్కోర్ లో 7 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు. మరో బ్యాటర్ నేహల్ వధేరా హాఫ్ సెంచరీతో రాణించాడు. వధేరా 34 బంతుల్లో 52 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League 2023)లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మధ్య మ్యాచ్ జరిగింది. ఐపీఎల్-2023లో ఇది 54వ మ్యాచ్.

టాస్ గెలిచిన ముంబై మొదట బౌలింగ్ చేసింది. ముంబై ఇండియన్స్ ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బెంగళూరు బ్యాటర్లలో డుప్లెసిస్ 65, గ్లెన్ మ్యాక్స్ వెల్ 68, దినేశ్ కార్తీక్ 30 పరుగులు బాదారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 09 May 2023 11:09 PM (IST)

    16ఓవర్లకు స్కోర్ 193/4

    16 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

  • 09 May 2023 11:08 PM (IST)

    టిమ్ డేవిడ్ డకౌట్..

    ముంబై జట్టు 4వ వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ డకౌట్ అయ్యాడు.

  • 09 May 2023 11:05 PM (IST)

    సూర్యకుమార్ యాదవ్ ఔట్

    దూకుడుగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఔట్ అయ్యాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. సూర్య స్కోర్ లో 7 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు.

  • 09 May 2023 10:59 PM (IST)

    15 ఓవర్లకు స్కోర్ 174/2

    15 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేరా పరుగుల వరద పారిస్తున్నారు.

  • 09 May 2023 10:55 PM (IST)

    14 ఓవర్లకు స్కోర్ 154/2

    14 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

  • 09 May 2023 10:54 PM (IST)

    సూర్యకుమార్ యాదవ్ ఫిఫ్టీ

    ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సులతో 50 పరుగులు చేశాడు.

  • 09 May 2023 10:50 PM (IST)

    13 ఓవర్లకు స్కోర్ 141/2

    13 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేరా దంచి కొడుతున్నారు.

  • 09 May 2023 10:44 PM (IST)

    12 ఓవర్లకు స్కోర్ 124/2

    12 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేరా దంచి కొడుతున్నారు.

  • 09 May 2023 10:39 PM (IST)

    11 ఓవర్లకు స్కోర్ 114/2

    11 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేరా దంచి కొడుతున్నారు.

  • 09 May 2023 10:36 PM (IST)

    10 ఓవర్లకు 100/2

    10 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేరా ఉన్నారు.

  • 09 May 2023 10:30 PM (IST)

    9 ఓవర్లకు స్కోర్ 89/2

    9 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేరా ఉన్నారు.

  • 09 May 2023 10:26 PM (IST)

    8 ఓవర్లకు స్కోర్ 82/2

    8 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేరా ఉన్నారు.

  • 09 May 2023 10:18 PM (IST)

    7 ఓవర్లకు ముంబై స్కోర్ 74/2

    7 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.

  • 09 May 2023 09:54 PM (IST)

    3 ఓవర్లకు స్కోరు 34

    ముంబై ఇండియన్స్ లక్ష్య ఛేదనను ప్రారంభించింది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. మూడు ఓవర్లకు ఆ జట్టు స్కోరు 34గా ఉంది. ఇషాన్ కిషన్ 25, రోహిత్ శర్మ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 09 May 2023 09:24 PM (IST)

    ముంబై ఇండియన్స్ టార్గెట్ 200

    ముంబై ఇండియన్స్ జట్టు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బెంగళూరు బ్యాటర్లలో డుప్లెసిస్ 65, గ్లెన్ మ్యాక్స్ వెల్ 68, దినేశ్ కార్తీక్ 30 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు స్కోరు 199/6గా నమోదైంది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో జాసన్ 3, కామెరూన్, క్రిస్, కుమార్ కార్తికేయ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.

  • 09 May 2023 09:18 PM (IST)

    దినేశ్ కార్తీక్ ఔట్

    ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. దినేశ్ కార్తీక్ 30 పరుగులు చేసి క్రిస్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆర్సీబీ స్కోరు 19 ఓవర్లకు 193/6గా ఉంది. క్రీజులో కేదార్ జాదవ్ (10), హసరంగా (8) ఉన్నారు.

  • 09 May 2023 08:51 PM (IST)

    డు ప్లెసిస్ ఔట్

    ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడిన డు ప్లెసిస్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కామెరూన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.

  • 09 May 2023 08:46 PM (IST)

    నాలుగో వికెట్ డౌన్

    ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. మహిపాల్ 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులో డుప్లెసిస్ (65), దినేశ్ కార్తీక్ (1) ఉన్నారు. స్కోరు 14 ఓవర్లకు 146/4గా ఉంది.

  • 09 May 2023 08:38 PM (IST)

    గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఔట్

    గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఔట్ అయ్యాడు. 32 బంతుల్లో 68 పరుగులు చేసి జాసన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. క్రీజులో డుప్లెసిస్ (62), మహిపాల్ (1) ఉన్నారు. ఆర్సీబీ స్కోరు 13 ఓవర్లకు 140/3గా ఉంది.

  • 09 May 2023 08:33 PM (IST)

    దంచికొడుతున్న డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్

    డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ దంచి కొడుతున్నారు. ఆర్సీబీ స్కోరు 12 ఓవర్లలో 131/2గా ఉంది. క్రీజులో డు ప్లెసిస్ 57, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 64 పరుగులతో ఉన్నారు.

  • 09 May 2023 08:27 PM (IST)

    డు ప్లెసిస్ 30 బంతుల్లో అర్ధ సెంచరీ

    ఆర్సీబీ ఓపెనర్ డు ప్లెసిస్ 30 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. అందులో 2 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. మ్యాక్స్ వెల్ కూడా అర్ధ శతకం బాదిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ క్రీజులో ఉన్నారు.

  • 09 May 2023 08:22 PM (IST)

    ఆర్సీబీ స్కోరు 10 ఓవర్లకు 104/2

    ఆర్సీబీ జట్టు స్కోరు 10 ఓవర్లకు 104/2గా ఉంది. క్రీజులో డు ప్లెసిస్ 44, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 51 పరుగులతో ఉన్నారు.

  • 09 May 2023 08:16 PM (IST)

    మ్యాక్స్‌వెల్ అర్ధ సెంచరీ

    ఆర్సీబీ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లో 3 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీ బాదాడు. క్రీజులో మ్యాక్స్‌వెల్ (50 పరుగులు)తో పాటు డు ప్లెసిస్ 34 పరుగులతో ఉన్నాడు.

  • 09 May 2023 08:02 PM (IST)

    6 ఓవర్లకు 56/2

    ఆర్సీబీ జట్టు స్కోరు 6 ఓవర్లకు 56/2 గా ఉంది. క్రీజులో డు ప్లెసిస్ 26, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 23 పరుగులతో ఉన్నారు.

  • 09 May 2023 07:51 PM (IST)

    4 ఓవర్లకు 29/2

    ఆర్సీబీ స్కోరు 4 ఓవర్లకు 29/2గా ఉంది. క్రీజులో డు ప్లెసిస్ 18, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4 పరుగులతో ఉన్నారు. జాసన్ కు 2 వికెట్లు దక్కాయి.

  • 09 May 2023 07:43 PM (IST)

    అనుజ్ ఔట్

    ఆర్సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జాసన్ బౌలింగ్ లో 2.2 ఓవర్ వద్ద అనుజ్ ఔట్ అయ్యాడు.

  • 09 May 2023 07:35 PM (IST)

    కోహ్లీ ఔట్

    ఆర్సీబీ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్లోనే విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. డుప్లెసిస్ తో కలిసి ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన కోహ్లీ 4 బంతులు ఆడాడు. జాసన్ బౌలింగ్ లో తొలి ఓవర్ 5వ బంతికి  ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ వెనుదిరిగాడు.

  • 09 May 2023 07:09 PM (IST)

    డు ప్లెసిస్ సేన

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు: విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, విజయ్‌ కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

  • 09 May 2023 07:08 PM (IST)

    రోహిత్ సేన

    ముంబై ఇండియన్స్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్

  • 09 May 2023 07:03 PM (IST)

    ముంబై బౌలింగ్

    టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. మొదట ఫీల్డింగ్ చేయడమే తమకు మంచిదని తమ జట్టు భావిస్తున్నట్లు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.