IPL 2023, MI Vs RR: రాజస్థాన్‌పై ముంబై విజయం
IPL 2023, MI Vs RR: ముంబైలోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

MI Vs RR
IPL 2023, MI Vs RR: ముంబైలోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
LIVE NEWS & UPDATES
-
ముంబై విజయం
ముంబైలోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (55; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో అలరించగా కామెరూన్ గ్రీన్(44; 26 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (45; 14 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టడంతో ముంబై గెలిచింది. రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ పడగొట్టారు.
-
రెండు ఫోర్లు
18వ ఓవర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. మొదటి బంతికి తిలక్ వర్మ ఫోర్ కొట్టగా ఆఖరి బంతికి టిమ్ డేవిడ్ ఫోర్ కొట్టడంతో 11 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లకు ముంబై స్కోరు 181/4. తిలక్ వర్మ(27), టిమ్ డేవిడ్(15) క్రీజులో ఉన్నారు.
-
ఫోర్, సిక్స్
17వ ఓవర్‌ను జేసన్ హోల్డర్ వేశారు. తిలక్ వర్మ ఓ ఫోర్ కొట్టగా, టిమ్ డేవిడ్ సిక్స్ బాదడంతో మొత్తంగా 14 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు ముంబై స్కోరు 170/4. తిలక్ వర్మ(20), టిమ్ డేవిడ్(11) క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ యాదవ్ ఔట్
ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సందీప్ శర్మ క్యాచ్ అందుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ (55) ఔటైయ్యాడు. దీంతో ముంబై 152 పరుగుల(15.4వ ఓవర్) వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లకు ముంబై స్కోరు 156/4. తిలక్ వర్మ(14), టిమ్ డేవిడ్(4) క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకం
జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో మొదటి బంతి(14.1వ ఓవర్)కి రెండు పరుగులు తీసి సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లకు ముంబై స్కోరు 150/3. తిలక్ వర్మ(13), సూర్యకుమార్ యాదవ్(55) క్రీజులో ఉన్నారు.
-
రెండు ఫోర్లు, సిక్స్
14వ ఓవర్ చహల్ వేశాడు.ఈ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఓ ఫోర్ కొట్టగా, తిలక్ వర్మ ఫోర్, సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు ముంబై స్కోరు 141/3. తిలక్ వర్మ(12), సూర్యకుమార్ యాదవ్(48) క్రీజులో ఉన్నారు.
-
20 పరుగులు
13వ ఓవర్‌ను కుల్దీప్ సేన్ వేశాడు. ఈ ఓవర్‌లో సూర్యకుమార్ రెచ్చిపోయి ఆడాడు. వరుసగా 6,4,4,4 బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు ముంబై స్కోరు 124/3. తిలక్ వర్మ(1), సూర్యకుమార్ యాదవ్(43) క్రీజులో ఉన్నారు.
-
మూడు పరుగులు
12వ ఓవర్‌ను చహల్ కట్టుదిట్టంగా వేయడంతో మూడు పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు ముంబై స్కోరు 104/3. తిలక్ వర్మ(1), సూర్యకుమార్ యాదవ్(24) క్రీజులో ఉన్నారు.
-
గ్రీన్ ఔట్
ముంబై మరో వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్డ్ క్యాచ్ పట్టడంతో కామెరూన్ గ్రీన్(44) ఔట్ అయ్యాడు. దీంతో 101పరుగుల(10.4వ ఓవర్) వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లకు ముంబై స్కోరు 101/3. తిలక్ వర్మ(0), సూర్యకుమార్ యాదవ్(20) క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ ఫోర్లు
పదో ఓవర్‌ను జేసన్ హోల్డర్ వేశాడు. ఈ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. మొత్తంగా 14 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు ముంబై స్కోరు 98/2. కామెరూన్ గ్రీన్(43), సూర్యకుమార్ యాదవ్(20) క్రీజులో ఉన్నారు.
-
ఇషాన్ కిషన్ ఔట్
ముంబై మరో వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్డ్ క్యాచ్ అందుకోవడంతో ఇషాన్ కిషన్(28) ఔట్ అయ్యాడు. దీంతో 76 పరుగుల(8.2వ ఓవర్) వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 9 ఓవర్లకు ముంబై స్కోరు 84/2. కామెరూన్ గ్రీన్(42), సూర్యకుమార్ యాదవ్(7) క్రీజులో ఉన్నారు.
-
ఫోర్, సిక్స్
ఎనిమిదవ ఓవర్‌ను చహల్ వేశాడు. ఈ ఓవర్‌లో గ్రీన్ సిక్స్ కొట్టగా ఇషాన్ కిషన్ ఫోర్ బాదడంతో మొత్తంగా 13 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు ముంబై స్కోరు 75/1. ఇషాన్ కిషన్(29), కామెరూన్ గ్రీన్(40) క్రీజులో ఉన్నారు.
-
4 పరుగులు
ఏడో ఓవర్‌ను అశ్విన్ కట్టుదిట్టంగా వేయడంతో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. 7 ఓవర్లకు ముంబై స్కోరు 62/1. ఇషాన్ కిషన్(23), కామెరూన్ గ్రీన్(32) క్రీజులో ఉన్నారు.
-
చెరో ఫోర్
సందీప్ శర్మ ఆరో ఓవర్‌ను వేయగా ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్ చెరో ఫోర్ కొట్టారు. ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు ముంబై స్కోరు 58/1. ఇషాన్ కిషన్(21), కామెరూన్ గ్రీన్(30) క్రీజులో ఉన్నారు.
-
కామెరూన్ గ్రీన్ సిక్స్
రవిచంద్రన్ అశ్విన్ ఐదో ఓవర్‌ను వేయగా ఆఖరి బంతికి గ్రీన్ సిక్స్ బాదాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు ముంబై స్కోరు 47/1. ఇషాన్ కిషన్(15), కామెరూన్ గ్రీన్(25) క్రీజులో ఉన్నారు.
-
7 పరుగులు
నాలుగో ఓవర్‌ను సందీప్ శర్మ వేశాడు. ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు ముంబై స్కోరు 36/1. ఇషాన్ కిషన్(13), కామెరూన్ గ్రీన్(17) క్రీజులో ఉన్నారు.
-
కామెరూన్ గ్రీన్ హ్యాట్రిక్ ఫోర్లు
మూడో ఓవర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. ఈ ఓవర్‌లో కామెరూన్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడంతో మొత్తంగా 15 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు ముంబై స్కోరు 29/1. ఇషాన్ కిషన్(10), కామెరూన్ గ్రీన్(14) క్రీజులో ఉన్నారు.
-
రోహిత్ శర్మ ఔట్
సందీప్ శర్మ రెండో ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతికి రోహిత్ శర్మ(3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ముంబై 14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్లకు ముంబై స్కోరు 14/1. ఇషాన్ కిషన్(9) క్రీజులో ఉన్నాడు.
-
ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మొదటి ఓవర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేయగా ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు కొట్టడంతో మొత్తంగా ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి.
-
ముంబై లక్ష్యం 213
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124; 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లు) ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ 53 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు జైస్వాల్ దూకుడు కొనసాగించడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, పీయూష్ చావ్లా రెండు, జోఫ్రా ఆర్చర్, రిలే మెరెడిత్ లు ఒక్కొ వికెట్ తీశారు.
-
రెండు సిక్సర్లు
జోఫ్రా ఆర్చర్ వేసిన 19వ ఓవర్‌లో జైస్వాల్ రెండు సిక్సర్లు బాదడంతో మొత్తంగా 13 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లకు రాజస్థాన్ స్కో196/6. యశస్వి జైస్వాల్(116), రవిచంద్రన్ అశ్విన్(2) క్రీజులో ఉన్నారు.
-
జైస్వాల్ సెంచరీ
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకం బాదాడు. రిలే మెరెడిత్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ఐపీఎల్‌లో 53 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో తొలి సెంచరీని సాధించాడు.18 ఓవర్లకు రాజస్థాన్ స్కో183/6. యశస్వి జైస్వాల్(104), రవిచంద్రన్ అశ్విన్(1) క్రీజులో ఉన్నారు.
-
ధ్రువ్ జురెల్ ఔట్
రిలే మెరెడిత్ బౌలింగ్‌లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో ధ్రువ్ జురెల్(2) ఔట్ అయ్యాడు. దీంతో 168 పరుగుల(17.1వ ఓవర్) వద్ద రాజస్థాన్ ఆరో వికెట్‌ను కోల్పోయింది.
-
షిమ్రాన్ హెట్మెయర్ ఔట్
అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో తొలి బంతికి సిక్స్ కొట్టిన షిమ్రాన్ హెట్మెయర్ ఆ తరువాతి బంతిని సైతం భారీ షాట్ కొట్టేందుకు యత్నించి బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కాడు. దీంతో 159 పరుగుల(16.3వ ఓవర్) వద్ద రాజస్థాన్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 17 ఓవర్లకు రాజస్థాన్ స్కో168/5. యశస్వి జైస్వాల్(92), ధ్రువ్ జురెల్(2) క్రీజులో ఉన్నారు.
-
జైస్వాల్ సిక్స్
రిలే మెరెడిత్ వేసిన 16వ ఓవర్‌లోని ఐదో బంతికి జైస్వాల్ సిక్స్ బాదాడు. ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 153/4. యశస్వి జైస్వాల్(85), షిమ్రాన్ హెట్మెయర్(2) క్రీజులో ఉన్నారు.
-
జేసన్ హోల్డర్ ఔట్
జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ క్యాచ్ పట్టడంతో జేసన్ హోల్డర్(11) ఔట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 143 పరుగుల(14.1వ ఓవర్) వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 143/4. యశస్వి జైస్వాల్(77), షిమ్రాన్ హెట్మెయర్(0) క్రీజులో ఉన్నారు.
-
జేసన్ హోల్డర్ సిక్స్, జైస్వాల్ ఫోర్
కామెరూన్ గ్రీన్ వేసిన 14వ ఓవర్‌లోని మూడో బంతికి జేసన్ హోల్డర్ సిక్స్ కొట్టగా ఆఖరి బంతికి జైస్వాల్ ఫోర్ బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 142/3. యశస్వి జైస్వాల్(77), జేసన్ హోల్డర్ (11) క్రీజులో ఉన్నారు.
-
ఫోర్, సిక్స్
పీయూష్ చావ్లా 13వ ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లో జైస్వాల్ ఫోర్, సిక్స్ కొట్టాడు. మొత్తంగా 13 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 126/3. యశస్వి జైస్వాల్(72), జేసన్ హోల్డర్ (3) క్రీజులో ఉన్నారు.
-
జైస్వాల్ రెండు ఫోర్లు
రిలే మెరెడిత్ వేసిన 12వ ఓవర్‌లో యశస్వి జైస్వాల్ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో ఈ ఓవర్‌లో మొత్తం 10 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 113/3. యశస్వి జైస్వాల్(61), జేసన్ హోల్డర్ (1) క్రీజులో ఉన్నారు.
-
పడిక్కల్ క్లీన్ బౌల్డ్
పీయూష్ చావ్లా బౌలింగ్‌లో పడిక్కల్(2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 103 పరుగుల(10.5వ ఓవర్) వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 103/3. యశస్వి జైస్వాల్(52), జేసన్ హోల్డర్ (0) క్రీజులో ఉన్నారు.
-
జైశ్వాల్ హాఫ్ సెంచరీ
పీయూష్ చావ్లా బౌలింగ్‌లో(10.2వ ఓవర్) ఫోర్ కొట్టి 32 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్‌లతో యశస్వి జైశ్వాల్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
-
శాంసన్ ఔట్.
అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో సంజు శాంసన్ (14) ఔట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 95 పరుగుల(9.5వ ఓవర్) వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 97/2. యశస్వి జైస్వాల్(43),దేవదత్ పడిక్కల్(1) క్రీజులో ఉన్నారు.
-
శాంసన్ ఫోర్
కుమార్ కార్తికేయ తొమ్మిదో ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతికి శాంసన్ ఫోర్ కొట్టడంతో 8 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 88/1. యశస్వి జైస్వాల్(43), సంజు శాంసన్(13) క్రీజులో ఉన్నారు.
-
బట్లర్ ఔట్
పీయూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన బట్లర్(18) రమన్‌దీప్ సింగ్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 72 పరుగుల(7.1వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 8 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 80/1. యశస్వి జైస్వాల్(42), సంజు శాంసన్(7) క్రీజులో ఉన్నారు.
-
బట్లర్ సిక్స్
కుమార్ కార్తికేయ వేసిన ఏడో ఓవర్‌లోని రెండో బంతికి బట్లర్ సిక్స్ బాదడంతో ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 72/0. యశస్వి జైస్వాల్(41), జోస్ బట్లర్(18) క్రీజులో ఉన్నారు.
-
పవర్ ప్లే
రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఆరో ఓవర్‌ను పీయూష్ చావ్లా వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతికి జైశ్వాల్ సిక్స్ కొట్టడంతో 7 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 65/0. యశస్వి జైస్వాల్(41), జోస్ బట్లర్(11) క్రీజులో ఉన్నారు.
-
జైశ్వాల్ నాలుగు ఫోర్లు
రిలే మెరెడిత్ వేసిన ఐదో ఓవర్‌లో జైశ్వాల్ నాలుగు ఫోర్లు కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 58/0. యశస్వి జైస్వాల్(35), జోస్ బట్లర్(10) క్రీజులో ఉన్నారు.
-
బట్లర్ రెండు ఫోర్లు
నాలుగో ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్ వేశాడు. ఈ ఓవర్‌లో బట్లర్ రెండు ఫోర్లు బాదడంతో మొత్తంగా 16 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 42/0. యశస్వి జైస్వాల్(19), జోస్ బట్లర్(10) క్రీజులో ఉన్నారు.
-
జైశ్వాల్ ఫోర్
మూడో ఓవర్‌ను కామెరూన్ గ్రీన్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతికి జైశ్వాల్ ఫోర్ కొట్టడంతో మొత్తంగా 7 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 26/0. యశస్వి జైస్వాల్(18), జోస్ బట్లర్(1) క్రీజులో ఉన్నారు.
-
దూకుడుగా ఆడుతున్న జైశ్వాల్
యశస్వి జైశ్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు. రెండో ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్ వేయగా రెండు సిక్స్‌లు కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 19/0. యశస్వి జైస్వాల్(14), జోస్ బట్లర్(0) క్రీజులో ఉన్నారు.
-
జైశ్వాల్ సిక్స్
టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్‌లు ఓపెనర్లుగా వచ్చారు. తొలి ఓవర్‌ను కామెరూన్ గ్రీన్ వేయగా మూడో బంతికి జైశ్వాల్ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి.
-
రోహిత్ శర్మ సేన
ముంబై ఇండియన్స్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్, అర్షద్ ఖాన్
-
సంజు శాంసన్ సేన
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్
-
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తమ జట్టు అద్భుతంగా ఆడుతోందని, టీమ్ మంచి ఫాంలో ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.