IPL 2025: ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్.. బౌండరీ లైన్ వద్ద ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ విన్యాసం.. కావ్యపాప రియాక్షన్ వీడియో వైరల్..
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ బంతితోనే కాదు ఫీల్డింగ్ విన్యాసాలతోనూ ఆకట్టుకుంటున్నాడు.

Credit BCCI
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించి హైదరాబాద్ విజేతగా నిలిచింది. తద్వారా చెపాక్ లో ఎస్ఆర్ హెచ్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది.
Also Read: IPL 2025 : కీలక మ్యాచ్.. ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్.. హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం!
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19.5 ఓవర్లలో ఆలౌట్ అయ్యి 154 పరుగులు మాత్రమే చేసింది. ఈ జట్టులో ఆయుష్ మాత్రే (30), బ్రెవిస్ (42) పరుగులు చేశారు. 400వ టీ20 ఆడిన ధోనీ (6) నిరాశ పర్చాడు. చివర్లో దీపక్ హుడా (22) దూకుడుగా ఆడటంతో చెన్నై స్కోర్ 150దాటింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు. చివర్లో కమిందు మెడిస్ (22బంతుల్లో 32 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 19నాటౌట్) రాణించడంతో ఎస్ఆర్ హెచ్ జట్టు 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అయితే, మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ఆల్ రౌండర్ కమిందు మెండిస్ అద్భుత ఫీల్డింగ్ తో ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్ అందుకున్నాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్ రౌండర్ కమిందు మెండిస్ బంతితోనే కాదు ఫీల్డింగ్ విన్యాసాలతోనూ ఆకట్టుకున్నాడు. కుడి, ఎడమ చేత్తో బౌలింగ్ చేసి ఔరా అనిపించిన అతడు.. చెపాక్ స్టేడియంలో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. హర్షల్ బౌలింగ్ లో ఓ స్లో బంతిని బ్రెవిస్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ లో ఉన్న కమిందు మెండిస్ వేగంగా దూసుకొచ్చి గోల్‌కీపర్ బంతిని అందుకునే తరహాలో 11.09 మీటర్ల దూరం పరిగెత్తి తన ఎడమవైపునకు సమాంతరంగా డైవ్ చేస్తూ ఆ క్యాచ్‌ను పట్టేయడం హైలైట్‌గా నిలిచింది. కమిందు సూపర్ క్యాచ్ తో బ్రేవిస్ నిరాశగా క్రీజును వదిలి పెవిలియన్ బాటపట్టాడు. ఈ క్యాచ్ నుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కమిందు క్యాచ్ పట్టిన తీరుతో కావ్యా మారన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కనిపించింది.
KAMINDU MENDIS WITH AN OUTRAGEOUS CATCH IN IPL 2025. 🤯pic.twitter.com/ukDlq24jQl
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2025
Kavya Maran in the stands. pic.twitter.com/dUeGbWWhBE
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2025