Vaibhav Suryavanshi – Sehwag : యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి సెహ్వాగ్ వార్నింగ్.. అలా అనుకుంటే వచ్చే ఏడాది కనిపించవు..
ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన అతి పిన్న వయస్కుడిగా రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.

Courtesy BCCI
ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన అతి పిన్న వయస్కుడిగా రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. లక్నోతో మ్యాచ్‌లో అరంగ్రేటం చేసిన ఈ 14 ఏళ్ల ఆటగాడు తన తొలి మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. తొలి బంతికే సిక్స్ కొట్టిన అతడు అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. సిక్స్‌తో అరంగ్రేటం చేసిన అతి కొద్ది మంది జాబితాలో అతడు చేరిపోయాడు.
ఈ మ్యాచ్‌లో అతడు 20 బంతులను ఎదుర్కొని 34 పరుగులు చేశాడు. ఇక శుక్రవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ దూకుడుగానే ఆడాడు. రెండు సిక్సర్లు బాది 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో ఈ కుర్రాడి పై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
CSK vs SRH : సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు.. ఆర్‌సీబీని ఫాలో కండి..
చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన ఎంతో మంది ఆటగాళ్లు.. ఆ తరువాత అంతే త్వరగా కనుమరుగైపోయిన దాఖలాలు చాలా ఉన్నాయన్నాడు. అందుకనే వైభవ్ ఆచితూచి తన కెరీర్‌ను ప్లాన్ చేసుకోవాలన్నాడు. మరో 20 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడాలనే లక్ష్యంతో ఉండాలన్నాడు. ‘ఉదాహరణకు కోహ్లీని చూడండి అతడు 19 ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు అతడు 18 సీజన్లు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీలాగే సూర్యవంశీ ఎదగాలి.’ అని సెహ్వాగ్ తెలిపాడు.
𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡
Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝
Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q
— IndianPremierLeague (@IPL) April 19, 2025
ఈ సీజన్‌లో సాధించిన దానికి సంతోషపడవద్దు అని చెప్పుకొచ్చాడు. ‘నేను తొలి బంతికే సిక్స్ కొట్టాను. నా అరంగ్రేం అద్భుతం.. నేను కోటిశ్వరుడిని అనే ఆలోచనలతో అతడు ఉంటే బహుశా వచ్చే ఏడాది అతడిని మనం చూసే అవకాశం ఉండకపోవచ్చు.’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు బాగా ఆడితే ప్రశంసలు వస్తాయని, విఫలం అయితే విమర్శిస్తారని, ఏదీ ఏమైనప్పటికి కూడా గర్వం తలకెక్కించుకోకూడదన్నాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ సూర్యవంశీని 1.10 కోట్లకు సొంతం చేసుకుంది.