DC vs GT : గుజరాత్ పై ఓటమి.. పిచ్‌ను నిందించిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్…
గుజరాత్ చేతిలో ఓడిపోవడం పై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు.

Courtesy BCCI
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్ సమీకరణాలు కాస్త సంక్లిష్టంగా మారింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఒక్క స్థానం కోసం ఢిల్లీ, ముంబై, లక్నో జట్ల మధ్య పోటీ నెలకొంది.
గుజరాత్ చేతిలో ఓటమిపై అక్షర్ పటేల్ స్పందించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడమే తమ ఓటమికి కారణం అని చెప్పాడు. గిల్, సాయి సుదర్శన్‌లు చాలా చక్కటి ప్రదర్శన చేశాడని మెచ్చుకున్నాడు. ‘వారు ఛేదనలో వికెట్లు కోల్పోకపోతే.. ఈజీగా టార్గెట్‌ను ఫినిష్ చేయొచ్చు. మ్యాచ్ సాగుతున్న కొద్ది పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది.’ అని అక్షర్ అన్నాడు.
Rohit Sharma : వాంఖడే కార్యక్రమం అనంతరం ఓ వ్యక్తిని తిట్టిన రోహిత్ శర్మ..! వీడియో వైరల్..
ఈ ఫలితం నిరాశపరిచిందన్నాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రశంసించాడు. ‘కేఎల్ రాహుల్ చాలా చక్కగా ఆడాడు. మంచి స్కోరు సాధించామని అనుకున్నాను. మ్యాచ్‌లో విజయం సాధించేందుకు బౌలర్లు చాలా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే.. వారికి ఈ రోజు కలిసి రాలేదు. పవర్ ప్లేలో మా బౌలింగ్, ఫీల్డింగ్ ను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో బంతి ఆగి వచ్చింది.’ అని అక్షర్ చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (112 నాటౌట్; 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. అనంతరం సాయి సుదర్శన్ (108 నాటౌట్; 61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకానికి తోడు శుభ్‌మన్ గిల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని గుజరాత్ 19 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది.