DC vs KKR : ఢిల్లీతో కేకేఆర్ కీల‌క మ్యాచ్‌.. ప్లేఆఫ్స్ రేసులో ఏ జ‌ట్టుకు ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయంటే?

మంగ‌ళ‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది.

DC vs KKR : ఢిల్లీతో కేకేఆర్ కీల‌క మ్యాచ్‌.. ప్లేఆఫ్స్ రేసులో ఏ జ‌ట్టుకు ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయంటే?

Courtesy BCCI

Updated On : April 29, 2025 / 12:18 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధ‌మైంది. మంగ‌ళ‌వారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ఇరు జ‌ట్ల‌కు ఎంతో కీల‌కం. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవ‌కాశం ఉంది.

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. 12 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్‌ర‌న్‌రేట్ +0.482గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది. హోం గ్రౌండ్‌లో కోల్‌క‌తా పై విజ‌యం సాధించి టాప్‌-4లో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల‌ని ఢిల్లీ భావిస్తోంది.

RR vs GT : ఓ వైపు వైభవ్‌ విధ్వంసకాండ కొనసాగుతుండగానే.. జైస్వాల్ అరుదైన రికార్డు..

మ‌రోవైపు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కేకేఆర్ 9 మ్యాచ్‌లో ఆడింది. మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. ఆ జ‌ట్టు ఖ‌తాలో 7 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.212గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం ఏడో స్థానంలో కొన‌సాగుతోంది. కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే ఈ సీజ‌న్‌లో మిగిలిన 5 మ్యాచ్‌లోనూ కేకేఆర్ విజ‌యం సాధించాల్సిందే. ఢిల్లీతో నేడు జ‌రిగే మ్యాచ్‌లో ఓడిపోతే ఆ జ‌ట్టు ప్లేఆఫ్స్ అవ‌కాశాలు గ‌ల్లంతు అవుతాయి.

హెడ్‌-టు-హెడ్‌…
ఐపీఎల్ చ‌రిత్ర‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు 34 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 18 మ్యాచ్‌ల్లో కోల్‌క‌తా విజ‌యం సాధించింది. మ‌రో 13 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫ‌లితం తేల‌లేదు. కాగా.. డీసీతో గ‌త సీజ‌న్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కేకేఆర్ గెలుపొందింది.

Rajasthan Royals : సూర్య‌వంశీ శ‌త‌కంతో గుజ‌రాత్ పై గెలిచిన రాజ‌స్థాన్‌కు భారీ షాక్.. ముంబైతో మ్యాచ్‌కు స్టార్ ఆట‌గాడు దూరం..

ఇరుజట్ల ప్లేయింగ్ ఎలెవ‌న్ (అంచ‌నా)..

ఢిల్లీ క్యాపిటల్స్..
ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అశుతోష్ శర్మ.

కోల్‌కతా నైట్ రైడర్స్..
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానె (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణ్‌దీప్ సింగ్/మనీష్ పాండే, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, మోయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

Vaibhav Suryavanshi : వైభ‌వ్ సూర్య‌వంశీ శ‌త‌కంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చి ప‌డిందే.. ఇప్పుడెలా?