RR vs GT : ఓ వైపు వైభవ్‌ విధ్వంసకాండ కొనసాగుతుండగానే.. జైస్వాల్ అరుదైన రికార్డు..

య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

RR vs GT : ఓ వైపు వైభవ్‌ విధ్వంసకాండ కొనసాగుతుండగానే.. జైస్వాల్ అరుదైన రికార్డు..

Courtesy BCCI

Updated On : April 29, 2025 / 2:05 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా సోమ‌వారం స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య‌వంశీ 35 బంతుల్లోనే శ‌త‌కం చేసి రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు అద్భుత విజ‌యాన్ని అందించాడు. ఓ వైపు ఈ కుర్రాడి విధ్వంసం కొన‌సాగుతుండ‌గానే మ‌రోవైపు య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

ఈ మ్యాచ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ కేవ‌లం 40 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 70 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ఐదో ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా.. అత‌డు చేసిన ప‌రుగులు అన్ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున చేసిన‌వే. య‌శ‌స్వి ఐపీఎల్ (2020) అరంగ్రేటం నుంచి కూడా రాజ‌స్థాన్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

Rajasthan Royals : సూర్య‌వంశీ శ‌త‌కంతో గుజ‌రాత్ పై గెలిచిన రాజ‌స్థాన్‌కు భారీ షాక్.. ముంబైతో మ్యాచ్‌కు స్టార్ ఆట‌గాడు దూరం..

ఈక్ర‌మంలో రాజస్థాన్‌ తరఫున అత్యంత వేగంగా 2వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. 62 ఇన్నింగ్స్‌ల్లోనే జైస్వాల్ ఈ ఘ‌న‌త సాధించాడు. అత‌డి క‌న్నా ముందు ఆర్ఆర్ త‌రుపున సంజూ శాంసన్‌ (3966), జోస్‌ బట్లర్‌ (3055), అజింక్యా రహానే (2810), షేన్‌ వాట్సన్‌ (2372) మాత్ర‌మే ఈ ఘ‌న‌త అందుకున్నారు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల ప‌రంగా) 2వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ఆట‌గాళ్లు వీరే..

క్రిస్‌ గేల్ – 48 ఇన్నింగ్స్‌ల్లో
షాన్‌ మార్ష్ – 52 ఇన్నింగ్స్‌ల్లో
రుతురాజ్‌ గైక్వాడ్ – 57 ఇన్నింగ్స్‌ల్లో
కేఎల్‌ రాహుల్ – 60 ఇన్నింగ్స్‌ల్లో
యశస్వి జైస్వాల్ – 62 ఇన్నింగ్స్‌ల్లో

RR vs GT : పాపం క‌రీమ్ జ‌న‌త్‌.. అరంగ్రేట మ్యాచే ఆఖ‌రిది కానుందా..! సూర్య‌వంశీ కార‌ణంగానే.. ఒకే ఓవ‌ర్‌లో 30 ప‌రుగులు..

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల ప‌రంగా) 2వేల ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్లు వీరే..

రుతురాజ్ గైక్వాడ్ – 57 ఇన్నింగ్స్‌ల్లో
కేఎల్ రాహుల్ – 60 ఇన్నింగ్స్‌ల్లో
య‌శ‌స్వి జైస్వాల్ – 62 ఇన్నింగ్స్‌ల్లో
స‌చిన్ టెండూల్క‌ర్ – 63 ఇన్నింగ్స్‌ల్లో
రిష‌బ్ పంత్ – 64 ఇన్నింగ్స్‌ల్లో

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. శుభ్‌మ‌న్ గిల్ (84), జోస్ బ‌ట్ల‌ర్ (50 నాటౌట్‌) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో మ‌హేశ్ తీక్ష‌ణ రెండు వికెట్లు తీయ‌గా జోఫ్రా ఆర్చ‌ర్‌, సందీప్ శ‌ర్మ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

Vaibhav Suryavanshi : వైభ‌వ్ సూర్య‌వంశీ శ‌త‌కంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చి ప‌డిందే.. ఇప్పుడెలా?

అనంత‌రం వైభ‌వ్ సూర్య‌వంశీ (101; 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర శ‌త‌కానికి తోడు య‌శ‌స్వి జైస్వాల్ (70; 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించ‌డంతో ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 15.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు న‌ష్టాపోయి అందుకుంది.