GT vs MI : ఒకవేళ ముంబై, గుజరాత్ ఎలిమినేటర్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే పరిస్థితి ఏంటి? హార్దిక్ కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా?
శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడుతోంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీతో పోటీపడేందుకు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడుతోంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లో స్థానం కోసం క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. క్వాలిఫయర్ 2లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌లో ఆర్‌సీబీతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఎలిమినేటర్‌లో విజేతగా నిలవాలని అటు ముంబై, ఇటు గుజరాత్ జట్లు భావిస్తున్నాయి.
వర్షం ముప్పు ఉందా?
ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు చాలా తక్కువ. అయినా గానీ ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే అప్పుడు క్వాలిఫయర్ 2కి ఏ జట్టు అర్హత సాధిస్తుంది అన్న ఆసక్తి చాలా మందిలో ఉంది.
వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే.. గ్రూప్ దశలో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు తరువాతి దశకు చేరుకుంటుంది.
PBKS vs RCB : సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడిని స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, ముంబై 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అంటే ఈ లెక్కన వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే గుజరాత్ టైటాన్స్ జట్టు క్వాలిఫయర్ 2కి చేరుకుంటుంది. ముంబై ఇంటి ముఖం పడుతుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు.