Kkr Vs Rcb: రాణించిన సునీల్ నరైన్, రహానె.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
టాస్ గెలిచిన ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసింది.

PIC: @IPL
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ 174 పరుగులు తీసింది. టాస్ గెలిచిన ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసింది.
ఆ జట్టు బ్యాటర్లలో డికాక్ 4, సునీల్ నరైన్ 44, అజింక్యా రహానె 56, వెంకటేశ్ అయ్యర్ 6, రఘువంశీ 30, రింకు సింగ్ 12, రస్సెల్ 4, రమన్‌దీప్ సింగ్ 6 (నాటౌట్), హర్షిత్ రాణా 5, స్పెన్సర్ జాన్సన్ 1 (నాటౌట్) పరుగు చేశారు.
దీంతో 20 ఓవర్లలో ఎనిమిది పరుగుల నష్టానికి కేకేఆర్ 174 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా 3, ఆర్సీబీ బౌలర్లలో జోష్ 2, యశ్ దయాల్, రషిక్, సుయశ్ శర్మ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: క్వింటన్ డి కాక్, వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
Also Read: ఆర్‌సీబీ కెప్టెన్ రజత్‌కు హర్భజన్ సింగ్ వార్నింగ్.. ఎందుకంటే?