IPL 2025: ధోనీతోనే ఆటలా.. సూర్యకుమార్ యాద‌వ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ‘తలా’.. వీడియో వైరల్

ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తాను వికెట్ల వెనకాల ఉంటే ఎలా ఉంటుందో చూపించాడు.

IPL 2025: ధోనీతోనే ఆటలా.. సూర్యకుమార్ యాద‌వ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ‘తలా’.. వీడియో వైరల్

MS Dhoni, Suryakumar Yadav Courtesy BCCI

Updated On : March 24, 2025 / 8:20 AM IST

MS Dhoni Stumping Video : ఐపీఎల్-2025 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సీఎస్‌కే జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయొ 158 పరుగులు చేసి విజయకేతనం ఎగురవేసింది. అయితే, ఈ మ్యాచ్ లో మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్ హైలెట్ గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: IPL 2025 : ముంబై ఓటమికి ప్రధాన కారణాలివే.. విఘ్నేశ్‌ను ఆపేసి సూర్యకుమార్ పెద్ద తప్పు చేశాడా..?

మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనకాల ఉన్నాడంటే ఎంతటి టాప్ బ్యాటర్లు అయినా క్రీజులో నుంచి ముందుకెళ్లి ఆడాలంటే వెనుకడుగు వేస్తారు. ఆ సమయంలో బాల్ మిస్ అయ్యి ధోనీ చేతిలోకి చేరిందంటే వెనక్కు చూడకుండా పెవిలియన్ కు వెళ్లిపోవాల్సిందే. ధోనీ మెరుపు వేగంతో స్టంప్ ఔట్ చేస్తాడు. అయితే, ధోనీ వయస్సు 40ఏళ్లు దాటడంతో వికెట్ల వెనకాల గతంలోలా చురుగ్గా కదల్లేడనే భావనలో కొందరు ఉంటారు. అలాంటి వారు షాక్ కు గురయ్యేలా సూర్యకుమార్ యాదవ్ ను ధోనీ మెరుపు వేగంతో స్టంప్ ఔట్ చేశాడు.

Also Read: CSK vs MI : చెన్నైతో ఓట‌మి త‌రువాత తాత్కాలిక కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ కామెంట్స్‌.. అది క‌రెక్ట్ కాద‌నిపించింది..

ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తాను వికెట్ల వెనకాల ఉంటే ఎలా ఉంటుందో చూపించాడు. ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను మెరుపు వేగంతో స్టంప్ ఔట్ చేసి అందర్నీ స్టన్ చేశాడు. దీంతో స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణతో మారుమోగిపోయింది.

 

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టుకు సరియైన ఆరంభం లభించలేదు. దీంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించేందుకు సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. తిలక్ వర్మతో కలిసి ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో సూర్యను కళ్లు చెదిరే స్టంపింగ్ తో ఔట్ చేసి ధోనీ మ్యాచ్ ను మలుపుతిప్పాడు. 11వ ఓవర్ లో చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ వేసిన బంతిని సూర్య క్రీజును వదిలి ముందుకెళ్లి భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ బాల్ మిస్ అయ్యి కీపర్ ధోనీ చేతుల్లోకి చేరింది.. 0.12 సెకన్లలోనే ధోనీ స్టంపౌట్ చేయడం విశేషం. ధోనీ స్టంపింగ్ కు సూర్య బిత్తరపోయి చూశాడు. అంపైర్ నిర్ణయం వెలువరించక ముందే డగౌట్ వైపు వెళ్లాడు.

 

సూర్యకుమార్ యాదవ్ ను మెరుపు వేగంతో ధోనీ స్టంప్ ఔట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ధోనీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. కొందరు నెటిజన్లు ‘సూర్య.. ధోనీతోనే ఆటలా.. ఇలానే ఉంటుంది రిజల్ట్’ అంటూ కామెంట్స్ చేశారు.