IPL 2025: క్వాలిఫయర్ 2 మ్యాచ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..

IPL 2025: క్వాలిఫయర్ 2 మ్యాచ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..

Courtesy BCCI

Updated On : June 1, 2025 / 11:50 PM IST

IPL 2025: కీలకమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. ముందు తడబడిన ముంబై తిరిగి నిలబడింది. పంజాబ్ కింగ్స్ ముందు చాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ చేరాలంటే పంజాబ్ 204 పరుగులు చేయాలి.

ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ చెరో 44 పరుగులు చేశారు. బెయిర్ స్టో 38 పరుగులు, నమన్ దీర్ 37 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఒమర్ జాయ్ 2 వికెట్లు తీశాడు. జేమిసన్, స్టోయినిస్, విజయ్ కుమార్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

Also Read: ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు.. గిల్ పోస్ట్ పై హార్దిక్ పాండ్యా స్పంద‌న ఇదే..