Hardik Pandya vs Shubman Gill : ఇద్దరి మధ్య విభేదాలు.. గిల్ పోస్ట్ పై హార్దిక్ పాండ్యా స్పందన ఇదే..
గిల్, హార్దిక్ పాండ్యా ఒకరినొకరు చూసుకోకపోవడం, విష్ చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించి క్వాలిఫయర్ 2కి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ టాస్ సమయంలో శుభ్‌మన్ గిల్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో అతడి పై విమర్శలు వచ్చాయి.
ఈ మ్యాచ్ సందర్భంగా గిల్, హార్దిక్ పాండ్యా ఒకరినొకరు చూసుకోకపోవడం, విష్ చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది. టాస్ సందర్భంగా ఈ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదని, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని, అందుకనే గిల్ ఔటైనప్పుడు హార్దిక్ దూకుడుగా సంబురాలు చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాగా.. వీటిపై ఇటు గిల్, అటు హార్దిక్ పాండ్యా ఇద్దరూ సంబంధించారు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఉన్న ఫోటోను గిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తమ మధ్య మంచి అనుబంధం, ప్రేమ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశాడు. ‘ప్రేమకు మించి ఏదీ లేదు, సోషల్ మీడియాలో చూసే ప్రతీది నమ్మవద్దు.’ అంటూ హార్దిక్ పాండ్యాను ట్యాగ్ చేశాడు.
PBKS vs MI : ముంబైతో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు ముందు పంజాబ్‌కు శుభవార్త..
ఈ పోస్ట్‌ను హార్దిక్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఎల్లప్పుడూ శుభూ బేబీ’ అనే క్యాప్షన్‌తో పంచుకున్నాడు.
దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని అర్థమవుతోంది. వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేయడంతో ఇక పుకార్లకు పుల్ స్టాప్ పడినట్లే.