Nitish Kumar Reddy : చెన్నై పై విజయం తరువాత నితీశ్‌కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘మేమేమి తక్కువ కాదు.. ఆర్‌సీబీలాగానే గెలుస్తాం..’
సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలపై చెన్నై పై విజయం తరువాత నితీశ్‌కుమార్ రెడ్డి మాట్లాడాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని సాధించింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను తొలిసారి ఓడించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై పై సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ప్లేఆఫ్స్ ఆశలను ఎస్ఆర్‌హెచ్ సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తేనే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది.
ఈ క్రమంలో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాల గురించి ఆ జట్టు ఆటగాడు, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి స్పందించాడు. గతేడాది ఆర్‌సీబీ స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నాడు. అప్పుడు ఆర్‌సీబీ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచిందని, వారిలా తాము చేయలేమా అని ప్రశ్నించాడు.
RCB INSPIRING OTHER TEAMS. 🙇♂️ pic.twitter.com/UQgr67X3ov
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2025
చెన్నై పై విజయం తరువాత నితీశ్ మాట్లాడుతూ.. సీఎస్‌కే పై విజయం సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. తాము ఒక్కొ మ్యాచ్ పైనే దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చాడు. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ గెలుస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.
‘కమిందు మెండిస్‌తో కీలక భాగస్వామ్యం నిర్మించడం బాగుంది. భారీ షాట్లు కొట్టాలని నేను అనుకోలేదు. బౌండరీలు కాకుండా సింగిల్స్, డబుల్స్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టాం. తేలికగా మ్యాచ్‌ను ముగించాలని మాట్లాడుకున్నాం.’ అని నితీశ్ తెలిపాడు.
‘ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్‌లు చాలా చక్కగా బౌలింగ్ చేశారు. అయినప్పటికి మేం విజయం సాధించడం బాగుంది. మాకు ఇది చావో రేవో మ్యాచ్. గతేడాది ఆర్‌సీబీ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. ఆ జట్టు వరుసగా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ ఏడాది మేం ఎందుకు ఇలా చేయకూడదు. వందశాతం ప్రదర్శన ఇస్తూ ఒక్కొ మ్యాచ్‌పై ఫోకస్ పెడితే విజయం సాధించేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.’ అని నితీశ్ అన్నాడు.