Courtesy BCCI
IPL 2025: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్లు చెలరేగిపోయారు. పంజాబ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు విలవిలలాడారు. ఫలితంగా పంజాబ్ జట్టు 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలోనే 111 పరుగులు మాత్రమే చేసింది.
హోమ్ గ్రౌండ్ లో పంజాబ్ బ్యాటర్లు విఫలం అయ్యారు. కేకేఆర్ బౌలర్లు విజృంభించడంతో పెవిలియన్ కు క్యూ కట్టారు. ప్రభ్ సిమ్రన్ సింగ్ 30 పరుగులు, ప్రియాంశ్ ఆర్య 22 పరుగులు, శశాంక్ సింగ్ 18 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో హర్షిత్ రానా 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే చెరో వికెట్ తీశారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here